అంగ‌న్‌వాడి కేంద్రాలన్ని ఇక ప్రీ స్కూళ్లు

First Published Jul 26, 2017, 7:06 PM IST
Highlights
  • ఒక్కో ప్రీ స్కూల్ సెంటర్ కోసం రూ. 2.40 లక్షలు అందించనున్న ప్రభుత్వం
  • రానున్న రోజుల్లో మానవ వనరులను అభివృద్ధికేనన్న చంద్రబాబు 

  
రాష్ట్రంలోని అంగ‌న్‌వాడి కేంద్రాల‌న్నీఇక నుంచి  ప్రీస్కూళ్లుగా మారనున్నాయి. ఈ ప్రీ స్కూళ్లలో చిన్నారులకు ఆటాపాటలతో పాటు, విద్యా సదుపాయాలను ప్రభుత్వమే కల్పించనుంది. ప్రైవేటుకు దీటుగా వీటిని అబివృద్ది చేయనున్నారు. వీటికోసం  ఒక్కో ప్రీ స్కూల్ సెంటర్ కోసం రూ. 2.40 లక్షలు ఖర్చు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వీటిద్వారా రానున్న రోజుల్లో మానవ వనరులను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు.  
ప్రీ ప్రైమరీ స్కూళ్ల నిర్వహణపై అమరావతిలో ముఖ్యమంత్రి తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  
మూడేళ్లలోపు  చిన్నారులకు న‌ర్స‌రీ, నాలుగేళ్ల   చిన్నారులకు ఎల్‌కేజీ, 4 నుంచి 5 ఏళ్ల వ‌య‌సు చిన్నారులకు యూకేజీ లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకోసం అంగన్‌వాడీ టీచర్లకు ఆంగ్లంలో శిక్షణ ఇప్పించనున్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖచే నియమింపబడిన సలహాదారులతో ఉపాద్యాయులకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు.
 పాఠ్యపుస్తకాలను పురపాలక శాఖ ఆద్వర్యంలో సరఫరా చేస్తారు.   ప్రభుత్వ, పురపాలక శాఖ భవనాలను కూడా ఈ స్కూళ్ల కోసం కేటాయించనున్నారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకుంటే  ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటారు.  ఉచితంగా చిన్నారులకు దుస్తులు పంపిణీ చేయలనున్నట్లు సీఎం తెలిపారు.
అంగ‌న్‌వాడీ సిబ్బంది విద్యార్థులను సొంత పిల్లల్లాగ చూసుకుంటూ, త‌ల్లుల‌ పాత్ర పోషించడం అభినందనీయమని ముఖ్యమంత్రి కితాబిచ్చారు. ఈ స్కూళ్ల ద్వారా వీరికి కూడా మెరుగైన జీతాలు అందనున్నాయని సీఎం తెలిపారు.  

click me!