టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసంలో ముగిసిన చండీయాగం .. 3 రోజుల పాటు నిష్ఠగా ప్రత్యేక పూజలు

Siva Kodati |  
Published : Dec 24, 2023, 08:13 PM ISTUpdated : Dec 24, 2023, 08:15 PM IST
టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసంలో ముగిసిన చండీయాగం .. 3 రోజుల పాటు నిష్ఠగా ప్రత్యేక పూజలు

సారాంశం

ఉండవల్లిలోని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నివాసంలో గత మూడు రోజులుగా మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహిస్తున్నారు . ఆదివారంతో శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహా చండీ యాగం ముగిసింది. 

ఏపీలో ఎన్నికల సీజన్ త్వరలో మొదలుకానుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. పొత్తులు, ఎత్తులు, సీట్ల పంపకాలు, నిధుల సమీకరణ, ప్రచారంపై కసరత్తు చేస్తున్నారు. ఇక తమ ప్రయత్నానికి దైవబలం తోడు కావాలంటూ హోమాలు, యజ్ఞాలు, ప్రత్యేక పూజలు చేయించేవారు సైతం ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్పూర్తితో తెలుగు రాష్ట్రాల్లో నేతలు హోమాల బాట పడుతున్నారు. 

తాజాగా ఉండవల్లిలోని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నివాసంలో గత మూడు రోజులుగా మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహిస్తున్నారు. ఆదివారంతో శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహా చండీ యాగం ముగిసింది. చంద్రబాబు దంపతులతో పాటు టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. గుంటూరుకు చెందిన శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో 40 మంది రుత్వికులు ఈ యాగ క్రతువు నిర్వహించారు. 

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు దాదాపు రెండు నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని, విజయవాడ కనక దుర్గమ్మని, సింహాద్రి అప్పన్నని దర్శించుకున్నారు. మరికొద్దినెలల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం వుండటంతో దైవబలం కోసం చంద్రబాబు యాగం చేయించినట్లుగా తెలుస్తోంది. 

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీరి భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శనివారం మధ్యాహ్నం నారా లోకేశ్ తో కలిసి వ్యూహ్యకర్త ప్రశాంత్ కిషోర్ గన్నవరం విమానాశ్రయానికి బయలు దేరారు.

అనంతరం వీరిద్దరూ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుని చంద్రబాబుతో భేటీ అయ్యారు. వీరి భేటీ సూమారు గంటన్నర పాటు జరిగింది.ఈ క్రమంలో ఏపీలో రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. అలాగే.. ప్రశాంత్ కిషోర్ బృందం చేసిన సర్వే రిపోర్ట్‌ను చంద్రబాబుకు అందించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ భేటీ అనంతరం ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చంద్రబాబునాయుడిని కలవడం వెనుక ప్రత్యేక కారణమేమి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు సీనియర్ రాజకీయనాయకుడు అని, ఆయన కలవాలని కోరడంతో వచ్చానని తెలిపారు. తాను చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశానని వెల్లడించారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!