
ఆంధ్రప్రదేశ్ విషయంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల దృక్పధంలో ఎటువంటి తేడా ఉన్నట్లు లేదు.
పచ్చగా ఉన్న సమైక్య రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజించి అప్పటి కాంగ్రెస్ పార్టీ దెబ్బతీయగా విభజన తర్వాత భారతీయ జనతా పార్టీ దెబ్బతీస్తోంది. సమైర్య రాష్ట్రం అడ్డుగులో విభజనకు కాంగ్రెస్ ఎంత కారణమో భాజపా కూడా అంతే కారణమన్న సంగతి అందరికీ తెలిసిందే. సరే, విభజన చట్టాన్నైనా అమలు చేస్తే, మెల్లిగా అయినా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందనుకుంటే ఆ ఆశకూడా లేకుండా పోతోంది.
విభజన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వే జోన్, రెవిన్యూ లోటు భర్తీ తదితరాలు ఏవీ అందకుండా చేసింది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం. తాజాగా ప్రభుత్వం పంపిన భూ సేకరణ బిల్లుకు కూడా అడ్డుపడింది. భూసేకరణ బిల్లు గనుక ఆమోదం పొందకపోతే రాజధాని నిర్మాణం భూసేకరణ సాధ్యం కాదు. అంతేకాకుండా, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, మచిలీపట్నం ఓడరేవు అభివృద్ధి తదితర అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం ఆగిపోవటమో లేక ఆలస్యం జరగటమో అవుతుంది.
చూడబోతే చంద్రబాబు తరహా అభివృద్ధి జరగటం కేంద్రానికి ఏమాత్రం ఇష్ట లేనట్లుంది. ఎందుకంటే, ఏపి పంపిన భూసేకరణ బిల్లు లాంటివే గుజరాత్, తెలంగాణా ప్రభుత్వాలు కూడా పంపాయి. గుజరాత్ నుండి వచ్చిన బిల్లైతే నేరుగా ప్రధానమంత్రి కార్యాలయమే ఆమోదించేసింది. తెలంగాణా నుండి వచ్చిన బిల్లును గ్రామీణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది.
అదే, ఏపి పంపిన బిల్లును మాత్రం వ్యవసాయ శాఖకు చేరింది. అభివృద్ధి పనులకు వ్యవసాయ భూములను ఉపయోగించటాన్ని వ్యవసాయశాఖ అభ్యంతర పెట్టింది. అంతేకాకుండా అదే విషయాన్ని 3 నెలల క్రితమే రాష్ట్రప్రభుత్వానికి పంపింది కూడా. అయితే, భూసేకరణ బిల్లు వల్ల పంటభూములకు ఎటువంటి నష్టం ఉండదని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల అదనంగా 12 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది.
అయితే, కొత్తగా సాగులోకి రానున్న 12 లక్షల హెక్టార్ల అదనపు భూమి ఎక్కుండుందో చూపాలని కేంద్రం అడిగింది. దానికి రాష్ట్రప్రభుత్వం వద్ద సమాధానం లేదు. దాంతో ఆ బిల్లును ఆమోదించటం కుదరదని కేంద్రవ్యవసాయ శాఖ అడ్డం తిరిగినట్లు సమాచారం. ఏపిలోని చంద్రబాబునాయుడు ప్రభుత్వం మిత్రపక్షమే అవటంతో ఏ విషయంలో అయినా మొదటినుండి కేంద్రం ఇటువంటి స్పెషల్ ట్రీట్మంటే ఇస్తోంది.