
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం భొగాబేనిలో కింగ్‌కోబ్రా కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన దామోదర ప్రధాన్ ఇంట్లో దాదాపు 11 అడుగుల భారీ కింగ్ కోబ్రా కనిపించింది. ఇంట్లో వాళ్ళు ఏదో పనిమీద ఇంటి వెనక్కు వెళ్ళినపుడు అక్కడ కనిపించింది భారీ కోబ్రా. దాంతో ఒక్కసారిగా వరి గుండెలు అదిరిపోయాయి.
అసలే విషనాగు, దానికి తోడు భారీగా ఉండంటతో కుటుంబ సభ్యులు ఇంట్లో నుండి బయటకు పరుగులు తీసారు. ఇంతలో అది రోడ్డుమీదకు రావటంతో దాన్ని చూసి అక్కడున్న వారు కూడా పారిపోయారు. అయితే, విషయం తెలుసుకున్న వారు పొరుగునే ఉన్న సోంపేటకు చెందిన పాములు పట్టే వ్యక్తిని రప్పించారు. సదరు వ్యక్తి చాకచక్యంగా భారీ కోబ్రాను పట్టుకుని దగ్గర్లోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
మరిన్ని తాజా వార్తల కోసం క్రింద క్లిక్ చేయండి