ఆ రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం... జగన్ పై కేంద్ర మంత్రి ధర్మెంద్ర ప్రధాన్ ప్రశంసలు

By Arun Kumar PFirst Published May 30, 2021, 12:33 PM IST
Highlights

విశాఖపట్నంలో ఆర్ఐఎన్ఎల్ ఆధ్వర్యంలో కోవిడ్ రోగుల చికిత్స కోసం నిర్మిస్తున్న 1000పడకల ఆస్పత్రిలో ఫేజ్-1 లో భాగంగా 300 పడకల సామర్థ్యం గల హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది.   

 విశాఖపట్నం: ఆరంభంలోనే కాదు సెకండ్ వేవ్ లోనూ రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్ధవంతంగా పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొనియాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాదిరిగానే జగన్‌ కూడా ఓ లక్ష్యమున్న నాయకుడని ప్రశంసించారు. చాలా విషయాల్లో ఏపీ మిగతా రాష్ట్రాలకు ఆదర్శమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

విశాఖపట్నంలో ఆర్ఐఎన్ఎల్ ఆధ్వర్యంలో కోవిడ్ రోగుల చికిత్స కోసం 1000పడకల ఆస్పత్రి నిర్మితమయ్యింది. అయితే ఫేజ్-1 లో భాగంగా 300 పడకల సామర్థ్యం గల హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది.   కేంద్ర న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వర్చువల్ గా ఈ హాస్పిటల్ ను ప్రారంభించనున్న ఏపీకి అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గాన్ సింగ్  కులస్తే కూడా పాల్గొన్నారు. 

ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. 

read more  పేదల సంక్షేమం కోసం రెండేళ్లుగా రాజీలేని ప్రయత్నం: సజ్జల రామకృష్ణారెడ్డి

ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) , గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు,  రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, అనకాపల్లి ఎంపీ బి.వి సత్యవతి, విశాఖపట్నం ఎంపీ ఎం.వీ.వీ సత్యనారాయణ, ఆర్ఐఎన్ఎల్ సీఎండీ ప్రదోష్ కుమార్ రాత్, ఆర్ఐఎన్ఎల్ డైరెక్టర్ కిశోర్ చంద్రదాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ , విశాఖపట్నం కలెక్టర్ వినయ్ చంద్,  గురజాడ కళాక్షేత్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ఐఎన్ఎల్ ప్రతినిధులు, విశాఖ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా హాస్పిటల్ ప్రారంభోత్సవం అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ... కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలంతా ఏకమైతేనే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలమన్నారు. రాష్ట్రాల్లో కోవిడ్‌ ప్రభావం తగ్గించడం వల్ల దేశవ్యాప్తంగా ఆ ప్రభావం తగ్గించినట్లవుతుందన్నారు కేంద్ర మంత్రి ధర్మెంద్ర ప్రధాన్. 
 

click me!