86 శాతం ప్రజలకు చేరిన సంక్షేమ పథకాలు: రెండేళ్ల పాలనపై బుక్ విడుదల చేసిన సీఎం జగన్

By narsimha lode  |  First Published May 30, 2021, 12:24 PM IST

 రాష్ట్రంలో తమ ప్రభుత్వం 86 శాతం ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అందించిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
 


అమరావతి: రాష్ట్రంలో తమ ప్రభుత్వం 86 శాతం ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అందించిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా రెండు డాక్యుమెంట్లను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారుమేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇప్పటికే 94.5శాతం హమీలను  అమలు చేస్తున్నామన్నారు. మొత్తం 129 హామీల్లో ఇప్పటికే 107 పూర్తి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

also read:పేదల సంక్షేమం కోసం రెండేళ్లుగా రాజీలేని ప్రయత్నం: సజ్జల రామకృష్ణారెడ్డి

Latest Videos

 ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ రెండేళ్ల కాలంలో అందిరికీ మంచి చేశాననే నమ్మకం తనకు ఉందన్నారు. ఇంకా మంచి చేయడానికి  ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు.  ఏ కష్టం వచ్చినా ప్రజలకు అండగా ఉంటామనే భరోసాను ఇచ్చామన్నారు. అందరి సహకారంతో రెండేళ్ల పాలనను పూర్తి చేసుకోగలిగినట్టుగా ఆయన చెప్పారు.  ప్రజలకు నేరుగా రూ. 95,528 కోట్లు లబ్ది చేకూరిందన్నారు. ఇతర పథకాల ద్వారా మరో రూ. 36, 197 కోట్లు ప్రజలకు లబ్ది చేకూరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. 

రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల సమాచారాన్ని పొందుపర్చిన బుక్ లెట్ తో పాటు ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుండి అందిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ మరో బుక్ లెట్ ను సీఎం సంతకంతో విడుదల చేశారు గ్రామ సచివాలయ సిబ్బంది వీటిని ప్రజలకు అందించనున్నారు. ప్రతి గ్రామ సచివాలయ వ్యవస్థతో పనిచేస్తున్న ప్రతి సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్దిదారుల ఇళ్లకు గ్రామ పచివాలయ సిబ్బంది చేర్చారని ఆయన  అభినందించారు. 

click me!