కేంద్రం బాగా బిగించేస్తోంది...

Published : Jul 24, 2017, 12:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
కేంద్రం బాగా బిగించేస్తోంది...

సారాంశం

ఒకవైపు పెరిగిపోతున్న అప్పులు, ఇంకోవైపు తగ్గిపోతున్న ఆదాయాలు, మరోవైపు అదుపు తప్పిన ఖర్చులు చివరగా కేంద్ర సహాయనిరాకరణ..ఇలా నాలుగువైపుల నుండి ఆర్ధిక సమస్యలు కమ్ముకుంటున్నాయి. ఆర్ధికం అవసరాలు తీర్చుకోవటానికి చంద్రాబాబునాయుడు ప్రభుత్వం చేస్తున్న ప్రతీ విజ్ఞప్తినీ కేంద్రం పక్కన పెట్టేస్తోంది. రాష్ట్రం అప్పు సుమారు రూ. 2 లక్షల కోట్లు దాటిపోయింది. రాజధాని నిర్మాణం, పోలవరం లాంటి ప్రాజెక్టులకు డబ్బులు సర్దుబాటు సాధ్యం కాదు. అప్పులు పుట్టకపోతే నిర్మాణాలు పూర్తికావు.  

మారిన రాజకీయ పరిస్ధితిల్లో కేంద్రం రాష్ట్రప్రభుత్వాన్ని బాగా బిగించేస్తోంది. ఆర్ధికం అవసరాలు తీర్చుకోవటానికి చంద్రాబాబునాయుడు ప్రభుత్వం చేస్తున్న ప్రతీ విజ్ఞప్తినీ కేంద్రం పక్కన పెట్టేస్తోంది. మరీ ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. దాంతో చుట్టుముడుతున్న ఆర్ధిక కష్టాల  నుండి ఎలా బయటపడాలో ప్రభుత్వానికి అర్ధం కావటం లేదు. ఒకవైపు పెరిగిపోతున్న అప్పులు, ఇంకోవైపు తగ్గిపోతున్న ఆదాయాలు, మరోవైపు అదుపు తప్పిన ఖర్చులు చివరగా కేంద్ర సహాయనిరాకరణ..ఇలా నాలుగువైపుల నుండి ఆర్ధిక సమస్యలు కమ్ముకుంటున్నాయి.

మూడేళ్ళక్రితం లోటు బడ్జెట్ తో ప్రారంభమైన ప్రభుత్వం చంద్రబాబు డాబు, దర్పాల కారణంగా మరింత ఊబిలోకి కూరుకుపోయింది. చివరకు అప్పులతోనే మనుగడ సాగించాల్సిన పరిస్ధితిలోకి దిగజారిపోయింది. ఫలితంగా రాష్ట్రం అప్పు సుమారు రూ. 2 లక్షల కోట్లు దాటిపోయింది. అంటే కేంద్రం విధించిన ఎఫ్ఆర్బిఎం పరిధిని కూడా దాటిపోయింది. రాష్ట్ర స్ధూలఆదాయంలో 25 శాతం దాటకూడదు అప్పులు. కానీ రాష్ట్ర అప్పు 27 శాతాన్ని దాటిపోయింది. ఎఫ్ఆర్బిఎం పరిధిని పెంచమని రాష్ట్రప్రభుత్వం అడిగినా కేంద్రం అంగీకరించటం లేదు. కాబట్టే ఎవరూ అప్పు ఇవ్వటం లేదు.

పోనీ విదేశీసంస్దల నుండి తీసుకునే అప్పులను రాష్ట్రం ఖాతాలో చూపవద్దని చేసిన విజ్ఞప్తికీ కేంద్రం అంగీకరించలేదు. దీనివల్ల రాజధాని నిర్మాణం, పోలవరం లాంటి ప్రాజెక్టులకు డబ్బులు సర్దుబాటు సాధ్యం కాదు. అప్పులు పుట్టకపోతే నిర్మాణాలు పూర్తికావు. ఈ విషయాలన్నీ కేంద్రానికి తెలిసినా ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఏపిలో నెలకొన్న ప్రత్యేక పరిస్ధితులను పరిటణలోకి తీసుకుని  అప్పుల విషయంలో రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని రాష్ట్రం రాసిన లేఖను కేంద్రం ఖాతరు చేయలేదు. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు.

 

 

 

PREV
click me!

Recommended Stories

సామాన్యుడిలా మత్య్సకార కుటుంబాలతో నారా లోకేష్ చిట్ చాట్ | Nara Lokesh Visits Fishermen in Puligadda
JC Prabhakar Reddy Challenges Peddareddy: పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ | Asianet Telugu