కొండను తవ్వి ఎలుకను కుడా పట్టలేదు

First Published Sep 8, 2017, 7:41 AM IST
Highlights
  • యావత్ దేశంలోని కోట్లాదిమంది ప్రజలు నెలల తరబడి రోడ్డున పడటమే.
  • మొదటివారంలో నోట్ల రద్దును ప్రకటించిన ఫలితంగా చేతిలో ఉన్న డబ్బు మొత్తం ఎందుకు ఉపయోగం లేకుండా పోయింది.
  • విచిత్రమేంటంటే, చేతిలోనో బ్యాంకు ఖాతాల్లోనో డబ్బున్నా చెల్లుబాటుకాని పరిస్ధితి.
  • ఒకవైపు కోట్లాదిమంది జనాల చేతిలోని డబ్బు పనికిరానిదైపోగా, మరోవైపు కేంద్రం ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండానే పెద్ద నోట్లను రద్దు చేయటం.

కేంద్రప్రభుత్వం చివరకు కొండను తవ్వి ఎలుకను కుడా పట్టలేకపోయింది. నల్లధనాన్ని బయటకు తేవటమే లక్ష్యమని చెప్పి ప్రధానమంత్రి పోయిన నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేసారు. అప్పట్లో కేంద్రం వేసిన అంచనా ప్రకారం దేశంలోని నల్లధనం సుమారు రూ. 5 లక్షల కోట్లుంటుంది. అయితే, బయటకు వచ్చిందెంత? అంటే సుమారుగా ఇప్పటి వరకూ 15 వేల కోట్ల రూపాయలు కుడా లేదు. వేసిన అంచనా ఎంత, బయటకు వచ్చిందెంత? ఇక్కడే తెలిసిపోతోంది కేంద్రం అంచనాలు ఎంత భయంకరంగా విఫలమైందో.

మరి, ప్రధాని ప్రకటన వల్ల జరిగిందేంటి? యావత్ దేశంలోని కోట్లాదిమంది ప్రజలు నెలల తరబడి రోడ్డున పడటమే. మొదటివారంలో నోట్ల రద్దును ప్రకటించిన ఫలితంగా చేతిలో ఉన్న డబ్బు మొత్తం ఎందుకు ఉపయోగం లేకుండా పోయింది. విచిత్రమేంటంటే, చేతిలోనో బ్యాంకు ఖాతాల్లోనో డబ్బున్నా చెల్లుబాటుకాని పరిస్ధితి. ఒకవైపు కోట్లాదిమంది జనాల చేతిలోని డబ్బు పనికిరానిదైపోగా, మరోవైపు కేంద్రం ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండానే పెద్ద నోట్లను రద్దు చేయటం. దాంతో కోట్లాదిమంది జనాలు నెలల తరబడి బ్యాంకుల ముందు క్యూలైన్లలోనే ఉండిపోవాల్సొచ్చింది.

సరే, కేంద్రం అనాలోచిత చర్య వల్ల జనాలేకాకుండా, దేశ ఆర్ధిక పరిస్ధితి కుడా తల్లక్రిందులైపోయింది. దేశంలోని దాదాపు అన్నీ రంగాలూ కుదేలైపోయాయి. విచిత్రమేంటంటే, దేశంలోని బ్లాక్ మనీని బయటకు తేవటమే లక్ష్యంగా చెబుతూ పెద్ద నోట్లు రద్దు చేసిన నరేంద్రమోడి రద్దైన నోట్ల స్ధానంలో అంతకన్నా పెద్ద నోట్లను తీసుకురావటం. దాంతోనే తెలిసోయింది బ్లాక్ మని నియంత్రణలో కేంద్రానికున్న చిత్తశుద్ది. ఫలితంగా బ్లాక్ మనీ బయటకు రాకపోగా మరింత పోగుపడింది.

అప్పట్లో రద్దైన పెద్ద నోట్ల విలువ సుమారు 15.44 లక్షల కోట్లు కాగా బ్యాంకులకు తిరిగి వచ్చేసిన నోట్ల విలువ రూ. 15.28 లక్షల కోట్లు. అంటే అంచనా వేసిన బ్లాక్ మనీలో తిరిగి వచ్చేసిందెంతో ఎవరికి వారే లెక్కలేసుకోవాలి.  అందుకే మోడి సర్కార్ ‘కొండను తవ్వి చివరకు ఎలుకను కుడా పట్టలేద’ని జనాలు జోకులేసుకుంటున్నారు.

click me!