చంద్రబాబు ఫోన్ చేసినా ఎత్తటం లేదట....

First Published Sep 7, 2017, 4:40 PM IST
Highlights
  • చంద్రబాబునాయుడు ఫోన్లు చేస్తున్నా జనాలు పట్టించుకోవటం లేదట.
  • స్వయంగా చంద్రబాబే ఫోన్ చేస్తే తీయని వాళ్ళుంటారా?  ఆ విషయాన్ని స్వయంగా చంద్రబాబే చెప్పారు కాబట్టి నిజమేనని అనుకోవాలి.
  • సంక్షేమ పథకాల అమలులో సంతృప్తస్ధాయిలపై జనాల అభిప్రాయాలను తెలుసుకోవాలని అనుకున్నట్లు సిఎం చెప్పారు.
  • అందుకనే లబ్దిదారులకు తానే స్వయంగా ఫోన్ చేసానన్నారు. అయితే, ఎవరు ఫోన్లు తీసి మాట్లాడటం లేదని నిష్టూరాలాడారు.

చంద్రబాబునాయుడు ఫోన్లు చేస్తున్నా జనాలు పట్టించుకోవటం లేదట. అదేంటి చంద్రబాబు అపాయింట్మెంట్ దొరక్క అందరూ అవస్తలు పడుతున్నారు కదా? స్వయంగా చంద్రబాబే ఫోన్ చేస్తే తీయని వాళ్ళుంటారా?  ఆ విషయాన్ని స్వయంగా చంద్రబాబే చెప్పారు కాబట్టి నిజమేనని అనుకోవాలి. చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండో దశకు సిఎం గురువారం శంకుస్ధాపన చేసారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ తాను ఫోన్ చేసినా ఎవరూ తీయటం లేదన్నారు. ఫోన్ తీస్తే బహుశా ఊకదంపుడు ఉపన్యాసం ఎక్కడ వినాల్సొస్తుందో అన్న భయమేమో.

సంక్షేమ పథకాల అమలులో సంతృప్తస్ధాయిలపై జనాల అభిప్రాయాలను తెలుసుకోవాలని అనుకున్నట్లు సిఎం చెప్పారు. అందుకనే లబ్దిదారులకు తానే స్వయంగా ఫోన్ చేసానన్నారు. అయితే, ఎవరు ఫోన్లు తీసి మాట్లాడటం లేదని నిష్ఠూరాలాడారు. చూడబోతే అందరరూ తనకన్నా బిజీగా ఉన్నట్లు కనబడుతోందని అభిప్రాయపడ్డారు. అదే సందర్భంలో జనాలకు చురకలు కుడా వేసారులేండి. అభిప్రాయాలు తెలుసుకుందామనే తాను ఫోన్ చేస్తున్నాని అంటూనే తనకు పనిలేక ఫోన్లు చేస్తున్నానని అనుకుంటున్నారా అంటూ జనాలను నిలదీసారు. ర్యాండమ్ గా చెక్ చేద్దామని అనుకుంటే 22 మంది తన ఫోన్ కు జవాబు ఇవ్వలేదని వాపోయారు. 18 మంది మాత్రమే సమాధానిమిచ్చినట్లు చెప్పారు.

పనిలో పనిగా వైసీపీ పైన కుడా మండిపడ్డారు లేండి. క్రికెట్ బెట్టింగ్, రౌడీయిజం చేస్తున్నట్లు వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. చివరకు తనను కుడా బెదిరించాలని చూసారని అయితే తాను భయపడే రకం కాదన్నారు. తాను 24 గంటలూ పనిచేస్తున్నది పేదల కోసమేనని చెప్పారు. ఎందుకంటే, తనది పేదలకులంగా చెప్పుకున్నారు. వైసీపీ మాత్రం కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నట్లుగా ఆరోపించారు.

ఇంతకీ విచిత్రమేంటంటే, ఈరోజు శంకుస్ధాపన చేసింది చింతపూడి ఎత్తిపోతల పథకం రెండో దశకు. మరి, మొదటి దశ సంగతేంటి? మొదటిదశలో సగం పనులు కూడా పూర్తికాలేదు. అదెప్పుడు పూర్తవుతుందో తెలీదు. దాన్ని పూర్తి చేయకుండానే రెండోదశకు చంద్రబాబు శంకుస్ధాపన చేసేసారు.

 

click me!