కేసీఆర్‌, జగన్, షర్మిల ఒకటే.. ముగ్గురివి నాటకాలు: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jul 11, 2021, 07:27 PM ISTUpdated : Jul 11, 2021, 07:29 PM IST
కేసీఆర్‌, జగన్, షర్మిల ఒకటే.. ముగ్గురివి నాటకాలు: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

సారాంశం

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ మధ్య సాన్నిహిత్యం ఉందని.. ఆ ఇద్దరూ ప్రజల్ని మోసం చేస్తున్నారని టీడీపీ  ఎంపీ కేశినేని ఆరోపించారు. కేసీఆర్‌, జగన్, షర్మిల ముగ్గురూ ముగ్గురేనని.. వ్యాపారాల కోసం నాటకాలు ఆడుతున్నారని కేశినేని వ్యాఖ్యానించారు.   

జగన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త ఆస్తి పన్ను విధానంతో పూరి గుడిసె ఉన్నవారు కూడా ఆస్తి పన్ను కట్టలేక ఇల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆస్తి పన్ను సహా ఇతర పన్నులు పెంచుతోందని కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలోనే చెప్పామని.. ప్రజలు తమ మాట వినలేదని నాని గుర్తుచేశారు.

Also Read:కేసీఆర్, జగన్ తోడు దొంగలే: కేశినేని నాని విమర్శలు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలపై మోయలేని భారాన్ని ప్రభుత్వం వేస్తోందని ఎంపీ ఆరోపించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి విజయవాడ అభివృద్ధికి రూ.480 కోట్లు తెచ్చి కార్యక్రమాలు చేపట్టామని..  ఇప్పుడు నగరం మురికికుంటలా తయారైందని కేశినేని నాని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ మధ్య సాన్నిహిత్యం ఉందని.. ఆ ఇద్దరూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌, జగన్, షర్మిల ముగ్గురూ ముగ్గురేనని.. వ్యాపారాల కోసం నాటకాలు ఆడుతున్నారని కేశినేని నాని వ్యాఖ్యానించారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu