ఏపీలో కొత్తగా 2,665 మందికి పాజిటివ్.. మరణాలు, కేసుల్లో తూర్పుగోదావరే టాప్

Siva Kodati |  
Published : Jul 11, 2021, 06:08 PM ISTUpdated : Jul 11, 2021, 06:09 PM IST
ఏపీలో కొత్తగా 2,665 మందికి పాజిటివ్.. మరణాలు, కేసుల్లో తూర్పుగోదావరే టాప్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,665 మందికి కరోనా సోకగా.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే నిన్న వైరస్ నుంచి 3,231 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 91,677 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. 

ఆంధ్రప్రదేశ్‌‌కు భారీ ఊరట లభించింది. కరోనా కేసులు, మరణాలు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,665 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,19,948కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,002కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి తూర్పుగోదావరి 4, చిత్తూరు 3, గుంటూరు 3,  నెల్లూరు 1, ప్రకాశం 1, కృష్ణ 1, ప్రకాశం 1, విశాఖపట్నం 1, శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 3,231 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 18,78,266కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 91,677 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,29,86,288కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 28,680 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 106, చిత్తూరు 353, తూర్పుగోదావరి 529, గుంటూరు 223, కడప 161, కృష్ణ 281, కర్నూలు 33, నెల్లూరు 195, ప్రకాశం 285, శ్రీకాకుళం 56, విశాఖపట్నం 112, విజయనగరం 38, పశ్చిమ గోదావరిలలో 293 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు | Asianet News Telugu
Pawan Kalyan: కాకినాడలో ‘మన ఊరు - మాట మంతి’ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu