కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో కీలక వాదనలు చోటు చేసుకున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: అవసరమైతే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని సీబీఐ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సోమవారంనాడు తెలంగాణ హైకోర్టులో కీలక వాదనలు చోటు చేసుకున్నాయి.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయమై సీబీఐ స్పందనను కోరింది. అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవసరమైతే వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని సీబీఐ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
undefined
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉన్న సమయంలోనే సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేసిన విషయాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి న్యాయవాది గుర్తు చేశారు. అయితే వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ పై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని హైకోర్టు గుర్తు చేసింది.
సీబీఐకి భయపడి భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా దస్తగిరి సాక్ష్యం చెప్పారని అవినాస్ రెడ్డి లాయర్ కోర్టుకు చెప్పారు. దస్తగిరిని సీబీఐ బెదిరించిందన్నారు. అంతేకాదు చిత్రహింసలకు గురిచేసిందని ఎర్ర గంగిరెడ్డి చెప్పారని వైఎస్ అవినాష్ రెడ్డి లాయర్ హైకోర్టుకు తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి సహ నిందితుడని ప్రచారం జరుగుతుందని కడప ఎంపీ లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. అన్ని కోణాల్లో విచారణ నిర్వహించి అసలు నిందితులు ఎవరో తేల్చడం లేదని అవినాష్ రెడ్డి లాయర్ చెప్పారు.రాజకీయ కోణంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇరికించే కుట్ర జరుగుతుందని ఎంపీ లాయర్ వాదించారు
also read:రేపు విచారణకు రావాలి: సీబీఐ కార్యాలయం నుండి వెనుదిరిగిన వైఎస్ అవినాష్ రెడ్డి
కేసు విచారణను ఈ నెల 30వ తేదీ లోపుగా ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని సీబీఐ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుక వచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో హడావుడి చేశారని సీబీఐ తరపు న్యాయవాది గుర్తు చేశారు. ఒప్పటికే నాలుగు దఫాలు సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరయ్యారని హైకోర్టు గుర్తు చేసింది. కానీ వైఎస్ అవినాష్ రెడ్డినిఅరెస్ట్ చేయలేదు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని సీబీఐ న్యాయవాది చేసిన వ్యాఖ్యలను అవినాష్ రెడ్డి న్యాయవాది గుర్తు చేశారు.