ఆ వీడియో చూపించి మరీ .. పవన్ కళ్యాణ్ ఇజ్జత్ తీసిన పేర్ని నాని 

Published : Apr 17, 2023, 03:42 PM IST
ఆ వీడియో చూపించి మరీ .. పవన్ కళ్యాణ్ ఇజ్జత్ తీసిన పేర్ని నాని 

సారాంశం

Perni Nani: తెలంగాణ ప్రజలను వైసీపీ మంత్రులు, నాయకులు ఎవరూ ఏమనలేదని, కేవలం మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపైనే ఏపీ మంత్రులు స్పందించారని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణ ప్రజలను అన్నట్లు .. ఏపీ మంత్రులపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)పై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శలు గుప్పించారు. పవన్ ను జనం మర్చిపోతున్నారని..  అప్పుడప్పుడు ట్వీట్టర్ లో వీడియోలు, ట్వీట్లు చేస్తూ.. ఉంటారని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ మంత్రి హరీష్ రావు(Harish Rao) వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మాట్లాడటం తన మనసు గాయపరిచిందని పవన్ కళ్యాణ్ అంటున్నారనీ,  అసలు తెలంగాణ ప్రజలను ఏమీ అనకపోయినా పవన్ తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ మంత్రులను ఏదైనా అంటే పవన్ కళ్యాణ్ బాధ పడుతున్నారన్నారు. 

పవన్ కు ఈ కొత్త బాధేంటో అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు.  తెలంగాణ మంత్రి.. కన్న తల్లి  రాష్ట్రాన్ని అవమానించేలా మాట్లాడితే .. వైసీపీ మంత్రులు మాట్లాడతారని స్పష్టం చేశారు. ఈ క్రమంలో .. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పాత వీడియోను మీడియాకు చూపిస్తూ.. ఆనాడు రాష్ట్రం విడిపోతే 11 రోజులు అన్నం మనేశానని చెప్పిన పవన్, ఇప్పుడు ఏపీపై అసత్య ప్రచారం చేస్తున్న తెలంగాణ మంత్రులను వెనుకేసుకొస్తున్నాడని జనసేనానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణపై ఈ కొత్త ప్రేమేంటో తనకు అర్థం కావడం లేదని మండిపడ్డారు. ‘‘పవన్ కళ్యాణ్ ది ఆంధ్రప్రదేశ్ కాదా?.. కేవలం రాజకీయం కోసమే ఆంధ్రప్రదేశ్ కావాలా? లేదా  తెలంగాణ వాళ్ళకి పవన్  లొంగిపోయాడా?’’ అంటూ విమర్శలు గుప్పించారు. ఏపీని తెలంగాణ మంత్రి కించపరిస్తే.. అది వేరే అనడం సరికాదని మండిపడ్డారు. తెలంగాణ తరుపున వకాల్తా పుచ్చుకొని పవన్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వి కిరాయి మాటలు కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంతకు ముందు చంద్రబాబు, లోకేష్‌ను విమర్శిస్తే..  పవన్ ముందుకు వచ్చేవాడని.. ఇప్పుడు తెలంగాణ మంత్రులను ఏమైనా అంటే.. పవన్ కళ్యాణ్ వకాల్తా పుచ్చుకుని వస్తున్నారని విమర్శించారు. ఈ కొత్త వ్యవహరమేంటో అర్ధం కావడం లేదని ఏద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదంటూ విమర్శలు గుప్పించారు. 

పవన్ మళ్ళీ ఢిల్లీ వెళ్లి అడగాలి కదా? అంటూ వివేకా హత్య కేసులో అసలు ముద్దాయిలను వదిలేసి, అసహజ రీతిలో విచారణ జరుగుతుందని మండిపడ్డారు. రాంసింగ్ తప్పుడు మార్గంలో విచారణ జరిపారని.. సుప్రీంకోర్టు రాం సింగ్‌ను పక్కన పెట్టమని చెప్పిందని.. అయితే అదే రీతిలో ఇప్పుడు వచ్చిన అధికారులు విచారణ జరుపుతున్నారని వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కోణంలో విచారణ జరపడం వెనుక ఒత్తుడులు, లొంగుబాటు ఉన్నాయన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా జగన్‌పై హత్యాయత్నం జరిగిందని.. చంద్రబాబు టైమ్‌లో ఏమి విచారణ జరిగిందని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా తప్పుడు దర్యాప్తు చేశారని ఆరోపించారు. చంద్రబాబు అన్ని వ్యస్థలను వశ పర్చుకోవడంలో సిద్ధ హస్తుడని మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు.

వివేకా హత్య కేసు అసహజ రీతిలో తప్పుడు మార్గంలో వెళ్తుందని, వివేకా హత్య కేసులో అసలు ముద్దాయిలను వదిలేశారని మండిపడ్డారు. రామ్ సింగ్‌ను పక్కన పెట్టాలని చెప్పిందని,  అయితే, ప్రస్తుతం ఉన్న అధికారికూడా అదే బాటలో నడుస్తున్నాడంటూ పేర్ని నాని అన్నారు. వాస్తవ కోణంలో కాకుండా రాజకీయ కోణంలో విచారణ జరుగుతోందని, ఈ కేసులో సరైన పద్దతిలో విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. వివేకా కుమార్తె సునీత, రామ్ సింగ్ అంతా చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఉన్నారంటూ పేర్ని నాని ఆరోపించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం