పవన్ పర్యటన.. ప్రభుత్వంలో కదలిక: సుగాలి ప్రీతి కేసు సీబీఐ చేతికి...?

By Siva KodatiFirst Published Feb 11, 2020, 5:32 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కర్నూలు విద్యార్ధిని సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై జిల్లా ఎస్పీ ఫకీరప్ప స్పందిస్తూ.. ఈ కేసు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ ప్రాసెస్‌‌లో ఉందని ఏ క్షణంలోనైనా సీబీఐ దర్యాప్తు ప్రారంభం కావొచ్చునని ఆయన తెలిపారు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కర్నూలు విద్యార్ధిని సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై జిల్లా ఎస్పీ ఫకీరప్ప స్పందిస్తూ.. ఈ కేసు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ ప్రాసెస్‌‌లో ఉందని ఏ క్షణంలోనైనా సీబీఐ దర్యాప్తు ప్రారంభం కావొచ్చునని ఆయన తెలిపారు.

సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి కోర్టులో ట్రయల్స్ జరుగుతున్న దశలోనే మరోసారి దర్యాప్తు చేస్తున్నామని ఫకీరప్ప పేర్కొన్నారు. అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతుందని ఆయన వివరించారు. ఈ కేసు విచారణలో స్థానిక పోలీసుల నిర్లక్ష్యం ఉన్నా చర్యలు తీసుకుంటామని ఫకీరప్ప స్పష్టం చేశారు.

మూడేళ్ల క్రితం కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్‌లో ప్రీతీ బాయి అనే విద్యార్ధిని హాస్టల్ గదిలో ఉరేసుకుంది. తొలుత దీనిని అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు.. తమ బిడ్డపై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారని తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

Also Read:సుగాలి ప్రీతి కేసు: పవన్ ఫ్యాన్స్ ఒత్తిడి.. హరీష్ శంకర్ రెస్పాన్స్ ఇదే!

కేసు విచారణలో భాగంగా నిపుణులతో మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా.. దానిపై నిపుణుల కమిటీని వేశారు. ఆరు కమిటీల వరకు ప్రీతి పోస్ట్‌మార్టాన్ని పరిశీలిచంగా.. చివరికి పోలీసులు ఈ కేసులో ఛార్జీ షీటు దాఖలు చేశారు.

అయితే నిందితులు శిక్ష నుంచి తప్పించుకోవడానికి పోలీసులను మేనేజ్ చేస్తున్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ హోం సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని కలిసి వినతిపత్రం సైతం సమర్పించారు.

ఈ క్రమంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మూడు నెలల క్రితం కర్నూలు పర్యటనకు వచ్చిన సందర్భంగా సుగాలి ప్రీతి కేసుపై ఆరా తీశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయకపోతే మళ్లీ ఆందోళన చేస్తానని హెచ్చరించారు.

Also Read:దిశ యాప్‌తో ఏపీ పోలీసుల తొలి సక్సెస్: 6 నిమిషాల్లో స్పాట్‌కి, ఆకతాయి అరెస్ట్

ఇప్పటికి పోలీసులు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో బుధ, గురువారాల్లో పవన్ కల్యాణ్ కర్నూలు పర్యటనకు వస్తుండటంతో పాటు బుధవారం భారీ ర్యాలీకి సైతం పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల డిమాండ్ మేరకు సీబీఐతో విచారణ చేయించాలని నిర్ణయించి ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు సైతం పంపినట్లుగా తెలుస్తోంది. 

click me!