బెయిల్ రద్దు పిటిషన్: రఘురామకు షాక్.. జగన్, విజయసాయిరెడ్డిలకు సీబీఐ కోర్టులో ఊరట

By Siva KodatiFirst Published Sep 15, 2021, 2:54 PM IST
Highlights

అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఊరట కలిగింది. రఘరామ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది

అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఊరట కలిగింది. రఘరామ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

అంతకుముందు అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు  పిటిషన్లను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు  తెలంగాణ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ లను రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ తరుణంలో  వేరే న్యాయస్థానానికి ఈ పిటిషన్ ను బదిలీ చేయాలని రఘురామకృష్ణం రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు సీబీఐ కోర్టు తుది ఉత్తర్వులు జారీ చేయకుండా కూడా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణను ఇతర క్రిమినల్ కోర్టులకు బదిలీ చేయాలని రఘురామకృష్ణంరాజు ఆ పిటిషన్ లో కోరారు. .

అయితే విచారణను వేరే కోర్టుకు బదిలీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు రఘురామ వేసిన పిటిషన్ ను తిరస్కరించింది. అలాగే బెయిల్ రద్దు పిటిషన్ పై సిబీఐ కోర్టు బుధవారం ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ ర‌ఘురామ కోర‌గా కోర్టు తిర‌స్క‌రించింది. పిటిష‌న్ పై బలమైన వాదనలు లేకపోవడం, సీబీఐ కూడా పిటిషనర్ వాదనను తోసిపుచడంతో.. రఘురామ కృష్ణరాజు పిటిషన్ ని కోర్టు తోసిపుచ్చింది. సహేతుకమైన కారణం లేకుండా బదిలీ చేయడం కుదరదని స్పష్టం చేసింది. మరోవైపు సాక్షి మీడియాపై వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను మాత్రం హైకోర్టు బదిలీ చేసింది.

click me!