నరసరావుపేటలో దారుణం... పాతకక్షలతో యువకుడి దారుణ హత్య (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 15, 2021, 02:37 PM ISTUpdated : Sep 15, 2021, 02:42 PM IST
నరసరావుపేటలో దారుణం... పాతకక్షలతో యువకుడి దారుణ హత్య (వీడియో)

సారాంశం

పాతకక్షలకు ఓ యువకుడు బలయిన దారుణం గుంటూరు జిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది. గత ఆదివారం కనిపించకుండా పోయిన యువకుడు ఇవాళ ప్రాణాలు కోల్సోయి లభించాడు.

గుంటూరు: పాతకక్షల కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురయిన దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. గత ఆదివారం నుండి కనిపించకపోయిన యువకుడు ఇవాళ నిర్మానుష్య ప్రదేశంలో శవమై తేలాడు. 

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన పఠాన్ సుభాని గత ఆదివారం నుండి కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా ఆఛూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆదివారం పఠాన్ ఇంట్లో వుండగా పీర్ వలీ అనే వ్యక్తి వచ్చి బయటకు తీసుకువెళ్లాడని... అప్పటినుండి తన కొడుకు కనిపించడం లేదని తల్లి జాన్ బి పోలీసులకు తెలిపింది. 

వీడియో

దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి పీర్ వలీని అదుపులోకి తీసుకున్నారు. అతడిని తమదైన స్టైల్లో విచారించిన పోలీసులకు అసలు నిజాన్నిచెప్పాడు. పాతకక్షల నేపథ్యంలో పఠాన్ ను బాజీ అనే వ్యక్తి హతమార్చినట్లు తెలిపాడు. పట్టణంలోని మహింద్రా షోరూం వెనుక సుభాని డెడ్ బాడీని పడేసినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పఠాన్ ను అత్యంత దారుణంగా హతమార్చిన బాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్