
కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఐఏఎస్‌లకు శిక్ష విధించింది ఏపీ హైకోర్ట్. గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరికి శిక్ష పడింది. వీరికి ఈ నెల 29న శిక్ష ఖరారు చేస్తామని ప్రకటించింది ఏపీ హైకోర్ట్. పట్టు పరిశ్రమల శాఖలో ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును అమలు చేయకపోవడంతో కోర్ట్ ధిక్కార నేరం కింద చర్యలకు దిగిన న్యాయస్థానం.. కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.