సిబిఐ కేసుల నుండి టిడిపి పాలకమండలి సభ్యుడికి ఊరట

By Arun Kumar PFirst Published Sep 29, 2020, 8:05 AM IST
Highlights

 టిటిడి పాలకమండలి సభ్యులు, తమిళనాడు పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డికి సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చింది.

అమరావతి: పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిటిడి పాలకమండలి సభ్యులు, తమిళనాడు పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డికి సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చింది. ఆయనపై నమోదయిన కేసుల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని... కాబట్టి ఈ కేసును మూసివేయవచ్చని సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో శేఖర్ రెడ్డికి క్లీన్ చీట్ ఇస్తూ సిబిఐ కోర్టు తీర్సునిచ్చింది.  ఆయనతో పాటు మరో ఐదుగురికి కూడా ఈ కేసు నుండి బయటపడ్డారు. 

గతంలో మోదీ సర్కార్ పాత నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను విడుదల చేసింది. ఈ సమయంలో బ్యాంకుల ద్వారా పాతనోట్లను మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం కొన్ని నిబందనలు పెట్టింది. అయితే వీటిని అతిక్రమిస్తూ భారీగా పాతనోట్ల మార్పిడీకి పాల్పడ్డారని శేఖర్ రెడ్డిపై అభియోగాలున్నాయి. తన సన్నిహితుల ద్వారా ఆయన వివిధ వివిధ బ్యాంకుల ద్వారా భారీగా పాతనోట్ల మార్పిడికి పాల్పడి దాదాపు రూ.247 కోట్ల మేర ప్రభుత్వానికి మోసం చేశాడంటూ కేసు నమోదయ్యింది. 

ఈ కేసును సిబిఐ విచారించగా ఎలాంటి ఆధారాలు లభించలేవట. 170మందికి పైగా సాక్షులను విచారించినా ఎలాంటి ఆధారాలు లభించలేవని విచారణ చేపట్టిన సిబిఐ అధికారులు చెన్నై కోర్టుకు తెలపడంతో ఈ కేసును ఉపసంహరిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. 
 

click me!