వాకాటి ఇంటిపై సిబిఐ దాడులు

Published : May 12, 2017, 09:58 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
వాకాటి ఇంటిపై సిబిఐ దాడులు

సారాంశం

తడ, నెల్లూరు, హైదరాబాద్, సూళ్ళూరుపేటలో వాకాటి ఇళ్ళపై ఏకకాలంలో సిబిఐ దాడులు చేసి శోధాలు నిర్వహిస్తోంది.

అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఇంటిపై సిబిఐ దాడులు చేయటం కలకలం రేపుతోంది. నెల్లూరుకు చెందిన టిడిపి ఎంఎల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై ఉదయం హటాత్తుగా సిబిఐ అధికారులు దాడులు చేసారు. తడ, నెల్లూరు, హైదరాబాద్, సూళ్ళూరుపేటలో వాకాటి ఇళ్ళపై ఏకకాలంలో సిబిఐ దాడులు చేసి శోధాలు నిర్వహిస్తోంది.

పెద్ద ఎత్తున వివిధ వ్యాపారాలు చేస్తున్న వాకాటి ఎస్బీఐ, ఇండియన్ ఒవర్సీస్ బ్యాంకు, బ్యాంక్ ఆప్ బరోడాకు సుమారు రూ. 443 కోట్లు బకాయి పడ్డారు. ఇప్పటికే ఈయనపై అనేక చీటింగ్ కేసులు కూడా నమోదయ్యాయి. గతంలో వాకాటి ఇళ్ళపై ఐటి శాఖ అధికారులు దాడులు జరిపిన విషయం అందరికీ తెలిసిందే. ఐటి దాడులకు కొనసాగింపుగానే తాజాగా సిబిఐ దాడులు జరుగుతున్నది.

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు