వైసీపీ ఎంఎల్ఏ దంపతులపై కేసు

First Published Sep 21, 2017, 9:42 PM IST
Highlights
  • వైసీపీ ఎంఎల్ఏ సమస్యల్లో ఇరుక్కున్నారు.
  • ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ దంపతులపై సిబిఐ కేసు నమోదు చేసింది.
  • ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ సురేష్ తో పాటు ఆయన భార్య ఐఆర్‌ఎస్ అధికారిణి విజయలక్ష్మిపై సీబీఐ కేసు నమోదు చేసింది.

వైసీపీ ఎంఎల్ఏ సమస్యల్లో ఇరుక్కున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ దంపతులపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ సురేష్ తో పాటు ఆయన భార్య ఐఆర్‌ఎస్ అధికారిణి విజయలక్ష్మిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ-1గా విజయలక్ష్మి, ఏ-2గా సురేష్ లను సిబిఐ పేర్కొన్నది. ఆదాయానికి మించి రూ. కోటి ఉన్నట్లు గుర్తించింది. ఆదాయానికి మించిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు కూడా  సిబిఐ ప్రకటించింది. 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి, 2016 ఫ్రిబ్రవరి 29వ తేదీ వరకు వీరిద్దరు అక్రమ ఆస్తులు కలిగివున్నారని సీబీఐ పేర్కొంది. 1994 బ్యాచ్‌కు చెందిన విజయలక్ష్మి ఇండియన్ రైల్వే సర్వీస్‌ చేరి తర్వాత ఇన్‌కమ్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు.

 

click me!