రాజీనామా ‘కథ’ సుఖాంతం ?

Published : Sep 21, 2017, 07:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
రాజీనామా ‘కథ’ సుఖాంతం ?

సారాంశం

అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి  రాజీనామా ప్రకటన అటకెక్కినట్లేనా? కేవలం కొద్ది గంటల రాజీనామా డ్రామా బాగా రక్తికట్టింది. జెసి ప్రకటనతో చంద్రబాబునాయుడు కూడా దిగివచ్చారు. దాంతో ఎంపి పదవికి రాజీనామా చేయరని తేలిపోయింది. గురువారం మధ్యహ్నం మీడియాతో మాట్లాడిన జెసి వచ్చే బుధవారం ఎంపిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి  రాజీనామా ప్రకటన అటకెక్కినట్లేనా? కేవలం కొద్ది గంటల రాజీనామా డ్రామా బాగా రక్తికట్టింది. జెసి ప్రకటనతో చంద్రబాబునాయుడు కూడా దిగివచ్చారు. దాంతో ఎంపి పదవికి రాజీనామా చేయరని తేలిపోయింది. గురువారం మధ్యహ్నం మీడియాతో మాట్లాడిన జెసి వచ్చే బుధవారం ఎంపిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. రాజీనామాకు గడువు పెట్టగానే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. సరే, మొత్తానికి జెసి ప్రకటనతో టిడిపిలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. అనంతపురంలో రోడ్ల విస్తరణ చేపట్టలేకపోతున్నానని, చాగల్లు నుండి నీటిని కూడా తాడిపత్రికి విడుదల చేయించలేకపోతున్నట్లు బోల్డు బాధపడిపోయారు జెసి.

ప్రజా సమస్యలు పరిష్కారం చేయలేకపోయిన తర్వాత ఇక పదవుల్లో ఉండి ఏంటి ఉపయోగమంటూ పెద్ద నాటకానికి తెరలేపారు. సరే, జెసి లక్ష్యం నెరవేరింది కాబట్టి రాజీనామా అవసరం లేదంటున్నారు. ఎందుకంటే, చంద్రబాబానాయుడు రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో ఉండగా టైం చూసి జెసి రాజీనామా అస్త్రాన్ని సంధించారు. అది కూడా తగలాల్సిన చోటే సరిగ్గా తగిలింది.

విషయం తెలియగానే చంద్రబాబు వెంటనే నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమను పురమాయించారు. ఉమ వెంటనే తుంగభద్ర ఎస్ ఈ తో మాట్లాడారు. ఎస్ఈ వెంటనే చాగల్లు రిజర్వాయర్ ద్వారా నీటిని వదిలేసారు. అదే విషయాన్ని చంద్రబాబు మాటగా దేవినేని ఎంపి చెవిన వేసారు. దాంతో రాజీనామా అవసరం లేదని జెసి నిర్ణయానికొచ్చారు. సమస్యల పరిష్కారం కోసం పదవులకు రాజీనామా చేటానికి కూడా వెనకాడనని జెసి చెప్పకనే చెప్పినట్లైంది. మొత్తానికి జెసి రాజీనామా డ్రామా సుఖాంతమైంది. జెసినా మజాకానా?

PREV
click me!

Recommended Stories

Weather Alert: ఆరేబియా సముద్రం వైపు అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావ‌ర‌ణం ఎలా ఉండ‌నుందంటే
Republic Day Celebrations 2026: గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పీచ్ | Asianet Telugu