శిరోముండనం ఘటన: నూతననాయుడు భార్య మధుప్రియపై కేసు

Published : Aug 29, 2020, 10:44 AM IST
శిరోముండనం ఘటన: నూతననాయుడు భార్య మధుప్రియపై కేసు

సారాంశం

సినీ నిర్మాత నూతన్ నాయుడి నివాసంలో జరిగిన దళిత యువకుడి శిరోముండనం కేసులో ఆయన భార్య మధుప్రియపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

విశాఖపట్నం: దళిత యువకుడి శిరోముండనం కేసులో నిర్మాత నూతన్ నాయుడి భార్య మధుప్రియపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఆరుగురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మధుప్రియ సూచన మేరకే దళిత యువకుడికి శిరోముండనం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 

మధుప్రియతో పాటు మిగతావారిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ విభాగం ఏసీపీ త్రినాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.  తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో ఓ దళిత యువకుడికి శిరోముండనం చేసిన సంఘటన తీవ్ర సంచలన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనను మరిచిపోక ముందే విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో అటువంటి సంఘటనే జరిగింది. 

Also Read: ఏపీలో మరో శిరోముండనం: దళిత యువకుడికి గుండు గీయించిన సినీ నిర్మాత

సుజాతానగర్ కాలనీలో నివాసం ఉంటున్న పర్రి శ్రీకాంత్ అనే యువకుడు అదే కాలనీలో నివాసం ఉంటున్న సినీ నిర్మాత ఎన్. నూతన నాయుడి ఇంట్లో పనిచేస్తున్నాడు. మూడు నెలల పాటు అతని నూతన నాయుడి ఇంట్లో పనిచేసి నెల రోజుల క్రితం మానేశాడు. 

దాంతో శ్రీకాంత్ తమ ఇంట్లో మొబైల్ దొంగతనం చేశాడని నూతన నాయడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ విషయం మీద మాట్లాడాలని చెప్పి, ఇంటికి పిలిచారు. దాంతో శ్రీకాంత్ శుక్రవారం మధ్యాహ్నం అక్కడికి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన శ్రీకాంత్ కు శిరోముండనం చేశారు. 

Also Read: శిరోముండనం కేసు లో నూతన నాయుడు, ఏం జరిగింది?

నూతన నాయుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ మాత్రమే కాకుండా జనసేన నాయకుడు కూడా.  నూతన నాయుడు జై సమైక్యాంధ్ర తరఫున పెందుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేశారు. ఇటీవల విడుదలైన పరాన్న జీవి సినిమాకు దర్శకుడు కూడా. 

PREV
click me!

Recommended Stories

10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami