తుపాకీతో కాల్చుకొని ఏపీఎస్పీ ఎస్ఐ ఆత్మహత్య

Published : Aug 29, 2020, 08:10 AM ISTUpdated : Aug 29, 2020, 08:13 AM IST
తుపాకీతో కాల్చుకొని ఏపీఎస్పీ ఎస్ఐ ఆత్మహత్య

సారాంశం

గ్రేహౌండ్స్‌ యూనిట్‌లోనే తన సర్వీసు రివాల్వర్‌తో తలపై కాల్చుకుని మృతిచెందారు. షణ్ముఖరావు అనారోగ్యంతో బాధపడుతున్నారని, దీనివల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి వుంటారని అనుమానిస్తున్నారు.

తుపాకీతో కాల్చుకొని ఓ ఎస్ఐ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మతహత్యకు పాల్పడటం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా సంతకవిటికి చెందిన కె.షణ్ముఖరావు 2015 బ్యాచ్‌ ఏపీఎస్పీ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. ప్రస్తుతం కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్‌ యూనిట్‌లో పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి 8గంటల సమయంలో గ్రేహౌండ్స్‌ యూనిట్‌లోనే తన సర్వీసు రివాల్వర్‌తో తలపై కాల్చుకుని మృతిచెందారు. షణ్ముఖరావు అనారోగ్యంతో బాధపడుతున్నారని, దీనివల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి వుంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!