బాహుబలి కట్టప్ప తప్పించుకోగలిగాడు, కానీ ఈ కట్టప్ప కష్టం: రఘురామ సెటైర్

Published : Aug 29, 2020, 07:53 AM IST
బాహుబలి కట్టప్ప తప్పించుకోగలిగాడు, కానీ ఈ కట్టప్ప కష్టం: రఘురామ సెటైర్

సారాంశం

బాహుబలి రెండు సినిమాల్లోనూ కట్టప్ప తప్పుచేసినా తప్పించుకోగలిగాడు.....  కానీ, ఈ సారి ఆవభూముల కుంభకోణం నుంచి ఆ కట్టప్ప తప్పించుకోలేడంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణమరాజు హెచ్చరించారు

అధికార వైసీపీ పై సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సెటైర్లు రోజురోజుకి ఎక్కువయిపోతున్నాయి. ఆయన వ్యాఖ్యలు చేయని రోజు ఉండట్లేదంటా అతిశయోక్తి కాదు. ఆయన తాజాగా మరోసారి ఆవ భూముల కేసులో కట్టప్ప తప్పించుకోలేడు అంటూ సెటైర్లు వేశారు. 

ఏపీలో  పేదల ఇళ్ల స్థలాల పంపిణీ ముసుగులో ఆవ భూముల కుంభకోణానికి పాల్పడిన వారికి శిక్షపడటం ఖాయం. బాహుబలి రెండు సినిమాల్లోనూ కట్టప్ప తప్పుచేసినా తప్పించుకోగలిగాడు.....  కానీ, ఈ సారి ఆవభూముల కుంభకోణం నుంచి ఆ కట్టప్ప తప్పించుకోలేడంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణమరాజు హెచ్చరించారు

ఆయన న్యూఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ... ఈ కామెంట్స్ చేసారు. రాష్ట్రంలోని ఆవభూముల్లో జరుగుతున్న అవినీతిని రాష్ట్ర ప్రజానీకం గమనిస్తుందని ఆయన అన్నారు. ఇలలో స్థలాల పంపిణీ విషయంలో హైకోర్టు సూచనలను స్వాగతిస్తున్నట్టు ఆయన తెలిపారు. 

ఇళ్ల స్థలాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అధికారులతో కుమ్మక్కైన నేతలందరికీ కోర్టు తీర్పు ఒక చెంపపెట్టుకావాలని నరసాపురం ఎంపీ  అన్నారు. ఈ కుంభకోణంలో 500 కోట్ల దాకా చేతులు మారాయని,  దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.  

PREV
click me!

Recommended Stories

నాకెప్పుడూ ఇలాంటి ఆలోచన రాలేదు జగన్ కి వచ్చింది అందుకే.. Chandrababu on Jagan | Asianet News Telugu
రైతులందరికీ ఫ్రీగా సోలార్ పెట్టిస్తాం: CM Chandrababu Speech | Solar | Farmers | Asianet News Telugu