చిత్తూరు జిల్లా: వాగులో కొట్టుకుపోయిన కారు, తండ్రీకూతుళ్లు గల్లంతు

Published : Oct 23, 2020, 08:28 AM ISTUpdated : Oct 23, 2020, 08:29 AM IST
చిత్తూరు జిల్లా: వాగులో కొట్టుకుపోయిన కారు, తండ్రీకూతుళ్లు గల్లంతు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో జిల్లాలోని వాగులూ వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాగు ఉధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. ఇద్దరు గల్లంతయ్యారు.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో వర్షాల కారణంగా ప్రమాదం సంభవించింది. జిల్లాలోని పెనుమూరు మండలం కొండయ్యగారిపల్లి వద్ద వాగు ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది. నీటి ప్రవాహ ఉధృతికి అది కొట్టుకుపోయింది. దాంతో ఇద్దరు గల్లంతయ్యారు.

కారు కొట్టుకుపోయిన ఘటనలో తండ్రీకూతుళ్లు ఇద్దరు గల్లంతయ్యారు. ఓ మహిళ, కారు డ్రైవర్ బయటపడ్డారు. వారు చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలం ఒడ్డుపల్లి గ్రామానికి చెందినవారు. ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.  

చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. వరద నీటిలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయయి. పలు ప్రాంతాల్లో కార్లు, ఇతర వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి.

శ్రీరంగరాజపురం మండలం దుర్గరాజుపురం వద్ద ఓ కారు ప్రవాహంలో కొట్టుకుపోయింది. కారు నుంచి దూకేసి ప్రయాణికులు తమ ప్రాణాలను కాపాడుకున్నారు. కారు మాత్రం ప్రవాహంలో కొట్టుకుని పోయింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!