
తాడిపత్రి అసెంబ్లీ సీటులో గెలిచి విజయమ్మకు కానుకగా ఇస్తానంటూ తాడిపత్రి వైసీపీ ఇన్ఛార్జి కేతిరెడ్డి పెద్దారెడ్డి చెబుతున్నారు. తాడిపత్రి ఆడపడుచు విజయమ్మకు నియోజకవర్గంలో గెలుపును కానుకగా ఇవ్వాలంటే వచ్చే ఎన్నికల్లో సాధ్యమవుతుందా? అన్నదే పెద్ద ప్రశ్న. నియోజకవర్గంలో జెసి సోదరులు దశాబ్దాల తరబడి పాతుకుపోయారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడి నుండి వారికి ఓటమన్నదే దాదాపు లేదు. అటువంటి జెసి సోదరులు ఇపుడు టిడిపిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారిని ఓడించటమంటే చెప్పినంత ఈజీకాదు కేతిరెడ్డికి.
నియోజకవర్గంలో జెసి సోదరుల ఆగడాలు పెరిగిపోయాయట. దోపిడి, ధౌర్జన్యాలు, హత్యా రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారట. కాబట్టి జనాలు వైసీపీకి ఓట్లస్తారట. జెసి సోదరులపై వినిపిస్తున్న ఆరోపణలు ఇపుడు కొత్తమే కాదు. ఏ పార్టీలో ఉన్నా వారిపై ఆరోపణలు మామూలే. ఈమాత్రం దానికే కేతిరెడ్డి అనుకుంటున్నట్లు నియోజకవర్గంలోని జనాలు వైసీపీకి పట్టం కడతారా అన్నది ప్రశ్న. ఒకవేళ నిజంగానే కేతిరెడ్డి చెబుతున్నట్లు జరిగితే వచ్చే ఎన్నికల్లో టిడిపికి జిల్లా మొత్తంమీద గడ్డుకాలం ఖాయమనే చెప్పవచ్చు. చూడాలి ఏం జరుగుతుందో?