బాలకృష్ణ ఆ పని చేయగలడా ?

Published : Mar 08, 2017, 07:02 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
బాలకృష్ణ ఆ పని చేయగలడా ?

సారాంశం

అసలు అమరావతిలో ఏముందని వెళతారు?  ఇపుడు వెళ్లిన వారే అమరావతికి ఎందుకు వెళ్లామురా దేవుడా అని అనుకుంటున్నారు.

నందమూరి బాలకృష్ణ ఆ పని చేయగలడా? అదేనండి సినీ పరిశ్రమను అమరావతికి తీసుకురవాటం. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమను అమరావతికి తెచ్చేస్తానంటూ చెప్పారు. బాలయ్య మాటలు విన్న వారంతా ఆశ్చర్యపోయారు. నిజంగా జరిగే పనేనా? రాష్ట్ర విభజన తర్వాత సినిఫీల్డ్ లోని సీమాంధ్రకు చెందిన వారిలో అత్యధికులు తమకు హైదరాబాద్లో భద్రత లేదనుకున్నమాట వాస్తవం. అందుకే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంకు  మకాం మార్చేద్దామని కూడా నిర్ణయింకున్నారు.

 

రామానాయడు, దాసరి నారాయణరావు, నాగార్జున లాంటి వాళ్లకి ఇప్పటికే భీమిలీ ప్రాంతాల్లో స్ధిరాస్తులున్నాయి. పెద్ద స్టూడియోలు కూడా ఉన్నాయి. దాంతో మిగిలిన వారు కూడా అక్కడికి ఎందుకు వెళ్లిపోకూడదని అనుకున్నారు. దాంతో చంద్రబాబునాయుడు కూడా సానుకూలంగా స్పందించారు. చంద్రబాబైతే సినీ పరిశ్రమకు ఎన్నో హామీలిచ్చేసారు. అయితే ఇదంతా ఏడాదిన్నర క్రితం మాటలేండి.

 

ఈలోగా తెలంగాణా సిఎం కెసిఆర్ తో పలువురు సిని ప్రముఖులు సన్నిహితమైపోయారు. ఎందుకైనా మంచిదని కొడుకు కెటిఆర్ తో కూడా టచ్ లో ఉన్నారు. దాంతో సినీ ప్రముఖులకు వచ్చిన ఇబ్బంది లేదని కెసిఆర్ అభయమిచ్చేసారు. దాంతో హైదరాబాద్ వదిలాల్సిన అవసరం కనబడలేదు. అందుకనే విశాఖకు వెళదామనుకున్న వారు కూడా తమ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం.

 

ఈ నేపధ్యంలో హటాత్తుగా బాలయ్య సినీ పరిశ్రమను అమరావతికి తెచ్చేస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు అమరావతిలో ఏముందని వెళతారు?  ఇపుడు వెళ్లిన వారే అమరావతికి ఎందుకు వెళ్లామురా దేవుడా అని అనుకుంటున్నారు. ఇటువంటి పరిస్ధితుల్లో సినీ పరిశ్రమను అమరావతికి తెచ్చేస్తానని బాలయ్య ఏ ధైర్యంతో చెప్పారో ?

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు| Asianet News Telugu
Pemmasani Chandrasekhar Powerful Speech: Atal Bihari Vajpayee 101st Jayanthi | Asianet News Telugu