సభాపతులు అమ్ముడుపోయారు

Published : Mar 08, 2017, 04:26 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
సభాపతులు అమ్ముడుపోయారు

సారాంశం

చట్టసభల విలువలను కాపాడాల్సిన సభాపతులే అమ్ముడుపోతే ఇక విలువలు ఎవరు కాపాడుతారని ఘాటుగానే నిలదీసారు.

సభాపతులు అమ్ముడుపోయారా? ఎంతమాటన్నారు కాంగ్రెస్ ఎంఎల్సీ సి. రామచంద్రయ్య. చట్టసభల విలువలను కాపాడాల్సిన సభాపతులే అమ్ముడుపోతే ఇక విలువలు ఎవరు కాపాడుతారని ఘాటుగానే నిలదీసారు. ఇంతకీ రామచంద్రయ్యకు ఎందుకు అంత కోపమొచ్చిందో మాత్రం తెలీదు.  ఒక పార్టీ టిక్కెట్టుపై గెలిచిన సభ్యులు వేరే పార్టీకి కేటాయించిన సీట్లలో ఎలా కూర్చుంటారని తీవ్రంగా ప్రశ్నించారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ, మండలిలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదని వాపోయారు. అందుకే ప్రిసైడింగ్ అధికారుల అధికారాలను రివ్యూ చేసే అధికారాలు ఎన్నికల కమీషన్, పార్లమెంట్ స్పీకర్ కు ఇవ్వాలని రామచంద్రయ్య డిమాండ్ చేసారు. ఈ మేరకు రాష్ట్రపతికి లేఖ రాస్తున్నట్లు కూడా చెప్పారు.

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు