భీమవరంలో రొయ్యల వ్యాపారి కోదండరామారావు హత్య: ఖమ్మంలో డెడ్‌బాడీ

By narsimha lodeFirst Published Feb 16, 2021, 11:14 AM IST
Highlights

పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరానికి చెందిన రొయ్యల వ్యాపారి కోదండ రామారావు దారుణ హత్యకు గురయ్యాడు. నాలుగు రోజులుగా ఆయన ఆచూకీ  కన్పించకుండా పోయింది.

ఏలూరు:

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరానికి చెందిన రొయ్యల వ్యాపారి కోదండ రామారావు దారుణ హత్యకు గురయ్యాడు. నాలుగు రోజులుగా ఆయన ఆచూకీ  కన్పించకుండా పోయింది.

భీమవరంలో హత్య చేసి కోదండరామారావును హత్య చేసి ఖమ్మం జిల్లాలో డెడ్‌బాడీని వేశారు. నాలుగు రోజులుగా ఆయన ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎలాంటి సమాచారం లభ్యం కాలేదు.

 

పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరానికి చెందిన రొయ్యల వ్యాపారి కోదండ రామారావు దారుణ హత్యకు గురయ్యాడు. నాలుగు రోజులుగా ఆయన ఆచూకీ కన్పించకుండా పోయింది.భీమవరంలో హత్య చేసి కోదండరామారావును హత్య చేసి ఖమ్మం జిల్లాలో డెడ్‌బాడీని వేశారు.

— Asianetnews Telugu (@AsianetNewsTL)

అయితే  తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఆశ్వరావుపేట మండలం అచ్యుతాపురం జీడితోటలో కోదండరామారావు మృతదేహాం లభ్యమైంది. ఈ డెడ్ బాడీ గురించి సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో  మృతుడు భీమవరానికి చెందిన రొయ్యల వ్యాపారిగా గుర్తించారు.

పశ్చిమగోదావరి జిల్లాకు ఖమ్మం జిల్లా సరిహద్దు ఉంటుంది. దీంతో ఖమ్మం జిల్లాలో మృతదేహాన్ని వేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

click me!