కిమ్స్ లో చికిత్స పొందుతున్న గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును చూసిన ఆయన భార్య లావణ్య భావోద్వేగానికి లోనయ్యారు.
విశాఖపట్టణం: కిమ్స్ లో చికిత్స పొందుతున్న గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును చూసిన ఆయన భార్య లావణ్య భావోద్వేగానికి లోనయ్యారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ పల్లా శ్రీనివాసరావు చేస్తున్న ఆమరణ నిరహారదీక్షను మంగళవారం నాడు తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. శ్రీనివాసరావును కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
undefined
కిమ్స్ ఆసుపత్రిలో పల్లా శ్రీనివాసరావును ఇవాళ ఉదయం ఆయన భార్య లావణ్య చూసి ఉద్వేగానికి లోనయ్యారు. శ్రీనివాసరావును చూసి కంటతడి పెట్టుకొన్నారు.దీక్షను భగ్నం చేసినా కిమ్స్ ఆసుపత్రిలోనే తాను దీక్షను కొనసాగిస్తానని పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 10వ తేదీ నుండి ఆమరణ నిరహార దీక్షకు శ్రీనివాసరావు పూనుకొన్నారు. దీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణిస్తోందని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందారు.
ఇవాళ చంద్రబాబునాయుడు పల్లా శ్రీనివాసరావుకు సంఘీభావం ప్రకటించేందుకు రావాల్సి ఉంది. ఈ తరుణంలోనే పల్లా శ్రీనివాసరావు దీక్షను పోలీసులు భగ్నం చేశారు.