దీనికి బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. అక్కడ ఏమి చేయాలో నాకు తెలుసు అన్నారు. ఎక్కడ స్విచ్ నొక్కితే.. బల్బు ఎక్కడ వెలుగుతుందో మీరే చూస్తారు అంటున్నారు.
విజయవాడ : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలుగు తమ్ముళ్లలో ఆధిపత్య పోరు టీడీపీని చిక్కుల్లో పడేయబోతోంది. విజయవాడ వేదికగా మరోసారి ఎంపీ కేశినేని నాని, బుద్ధా వెంకన్నల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇంద్రకీలాద్రి కొలుపువున్న పశ్చిమ నియోజకవర్గంపైనే అందరి చూపు ఉంది. ఈ నియోజకవర్గం నాకే దక్కాలని బుద్ధా వెంకన్న అంటుండగా.. అలా దక్కనివ్వనని ఎంపీ నాని అంటున్నారు.
నిన్న కేశినేని నాని మాట్లాడుతూ.. తాను దోచుకోనని, మరెవ్వరనీ దోచుకోనివ్వనని అన్నారు. కాల్ మని, కొబ్బరి చిప్పల వారికి అవకాశం రాదు, రానివ్వను అన్నారు. తాను విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి కాపలా కుక్కనని, దోచుకుని, దాచుకునే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు.
నేను దోచుకోను.. మరెవరినీ దోచుకోనివ్వను - ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు
దీనికి బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. అక్కడ ఏమి చేయాలో నాకు తెలుసు అన్నారు. ఎక్కడ స్విచ్ నొక్కితే.. బల్బు ఎక్కడ వెలుగుతుందో మీరే చూస్తారు అంటున్నారు.
2019లో టీడీపీ ఓటమి పాలయినప్పటినుంచి వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. బుద్ధ వెంకన్న, నానిల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది. ఇప్పుడిది బాహాటంగా మారింది. ఎన్నికల ముంగిట్లో ఈ వివాదంతో టీడీపీకి తలనొప్పిగా మారిందని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే జనసేనతో పొత్తు వ్యవహారంతో సీట్ల సర్దుబాటు సవాల్ గా మారింది. దీనికి తోడు ఇప్పుడు వీరి గొడవతో.. మరింత ఇరకాటంలో పడినట్టయ్యింది.
విజయవాడ పశ్చిమంలో మరి ఎలాంటి రాజకీయ మార్పులు జరగనున్నాయో? దుర్గమ్మ అనుగ్రహం ఎవరికి ఉండబోతోందో? చంద్రబాబు టిక్కెట్ ఎవరికి ఇవ్వనున్నారో.. మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.