విశాఖలో విజృంభిస్తున్న కరోనా.. ఒకేరోజు పదిమందికి పాజిటివ్...

By SumaBala BukkaFirst Published Jan 2, 2024, 10:30 AM IST
Highlights

డిసెంబర్ రెండో వారంలో విశాఖపట్నంలో కరోనా కేసులు నమోదవడం మొదలయ్యింది. అప్పటినుంచి కరోనా కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

విశాఖపట్నం : విశాఖపట్నంలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.  తాజాగా ఒక్కరోజే పదిమందికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది దీంతో ఇప్పటికే కరోనా బారిన పడిన వారి సంఖ్య 38కి చేరుకుంది. వీరిలో హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న వారు కొంతమంది కాగా, 25 మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. డిసెంబర్ రెండో వారంలో విశాఖపట్నంలో కరోనా కేసులు నమోదవడం మొదలయ్యింది. అప్పటినుంచి కరోనా కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

డిసెంబర్ 24వ తేదీన సోమకళ అనే మహిళ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. కంచరపాలెంకు చెందిన ఈ మహిళ ఆ తర్వాత చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. మరణానంతరం పరీక్షల్లో ఆమెకు  కరోనా ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది సోమకళ కుటుంబ సభ్యులకు, వారితో టచ్ లో ఉన్న దగ్గరి బంధువులకు…స్క్రీనింగ్ చేశారు. వీటిలో నెగటివ్ రిపోర్టు వచ్చింది. ఈ సీజన్లో కరోనా అనుమానిత లక్షణాలతో మృతి చెందిన తొలి కేసు కావడంతో జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమయ్యింది. 

కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల: తెలుగు దేశానికి దెబ్బేనా?

ఇదిలా ఉండగా, గత నెల నుండి భారతదేశంలో COVID-19 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి, ప్రత్యేకించి కేరళలో కేసుల సంఖ్య పెరిగింది. ఒమిక్రాన్ సబ్-వేరియంట్ జేఎన్.1 తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీని వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రులలో నివేదించబడే COVID-19 అనుమానిత లేదా పాజిటివ్ కేసుల కోసం మార్గదర్శకాలను జారీ చేసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ కొత్త జాతిని తీవ్రమైన శాస్త్రీయ పరిశీలనలో ఉన్న వేరియంట్ (VOI)గా ప్రకటించింది. ఈ రూపాంతరం వృద్ధులకు, కోమోర్బిడిటీలతో బాధపడుతున్న వ్యక్తులకు ప్రాణాంతకం అని రుజువు చేస్తుంది. నిన్న విడుదల చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారతదేశం ఒక రోజులో మూడు COVID-సంబంధిత మరణాలను నమోదయ్యాయి. 636 తాజా కరోనావైరస్ కేసులను నివేదించింది. కేరళలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు మరణించారు.

click me!