న్యూఢిల్లీకి వై.ఎస్. షర్మిల: కాంగ్రెస్‌లో చేరికకు ముహుర్తం ఫిక్స్

By narsimha lodeFirst Published Jan 2, 2024, 11:59 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీలో ఈ నెల  4వ తేదీన వై.ఎస్. షర్మిల చేరనున్నారు.  సోనియా, రాహుల్ గాంధీ సమక్షంలో  ఆమె కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. 

హైదరాబాద్: యువజన శ్రామిక రైతు  తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్‌టీపీ ) అధినేత వై.ఎస్. షర్మిల  ఈ నెల 4వ తేదీన  న్యూఢిల్లీకి వెళ్లనున్నారు.  ఈ నెల  4వ తేదీన  వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.  షర్మిలతో పాటు  మరో  40 మంది కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకొనే అవకాశం ఉంది.షర్మిలను న్యూఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే ఆహ్వానించారు.

యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ అధినేత వై.ఎస్. షర్మిల  ఈ నెల  4వ తేదీన న్యూఢిల్లీకి వెళ్లనున్నారు.వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. షర్మిలతో పాటు  మరో 40 మంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.

also read:వైఎస్ఆర్‌టీపీ కీలక సమావేశం: కాంగ్రెస్‌లో విలీనంపై ప్రకటనకు ఛాన్స్

2023 అక్టోబర్ లోనే  వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం జరగాల్సింది. కానీ, చివరి నిమిషంలో ఈ ప్రక్రియ ఆగిపోయింది. తెలంగాణలో  వై.ఎస్. షర్మిల సేవలను  వినియోగించుకోవడంపై  రేవంత్ రెడ్డి సహా కొందరు నేతలు వ్యతిరేకించారు.దీంతో  ఈ ప్రక్రియ నిలిచిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీకి వై.ఎస్.షర్మిల దూరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరగనున్నాయి. 

వైఎస్ఆర్‌సీపీలోని అసంతృప్తులు వై.ఎస్. షర్మిల వెంట నడిచే అవకాశం ఉంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  వై.ఎస్. షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. వైఎస్ఆర్‌సీపీలో టిక్కెట్లు దక్కనివారితో పాటు , ఆ పార్టీలోని అసంతృప్తులు  వై.ఎస్.షర్మిల వైపు చూస్తున్నారు. 

also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల: తెలుగు దేశానికి దెబ్బేనా?

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయింది.  పదేళ్ల తర్వాత  కాంగ్రెస్ పార్టీ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఫోకస్ ను పెట్టింది.  ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్. షర్మిల సేవలను ఉపయోగించుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఓటింగ్ శాతం తీసుకురావడంపై  ఆ పార్టీ నాయకత్వం వ్యూహాలు రచిస్తుంది. 

also read:ఆంధ్రప్రదేశ్‌లో వంద రోజుల ప్లాన్: కాంగ్రెస్ వ్యూహమిదీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు వై.ఎస్.షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది.


 


 

click me!