మందుబాబులకు ఏపీ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్.. ఇవాళ్టీ నుంచి బ్రాండెడ్ లిక్కర్ అమ్మకం

By Siva KodatiFirst Published Dec 31, 2021, 5:45 PM IST
Highlights

మందుబాబులకు ఏపీ సర్కార్ (ap govt) శుభవార్త చెప్పింది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆ మద్యాన్ని ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు చెందిన రిటైల్‌ ఔట్‌లెట్లలో విక్రయించనున్నట్లు పేర్కొంది

మందుబాబులకు ఏపీ సర్కార్ (ap govt) శుభవార్త చెప్పింది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆ మద్యాన్ని ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు చెందిన రిటైల్‌ ఔట్‌లెట్లలో విక్రయించనున్నట్లు పేర్కొంది. బార్లు, వాక్‌ ఇన్‌ స్టోర్లలో ప్రీమియం బ్రాండ్లు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రీమియం బ్రాండ్ల విక్రయంపై ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాకు బ్రేకులేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 

మరోవైపు.. ఓవైపు రాష్ట్రంలో ఒమిక్రాన్ (Omicron) కేసులు పెరుగుతున్నా భారీ ఆదాయమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం న్యూఇయర్ (new year celebrations) సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ బాటలో నడుస్తూ ఇవాళ(డిసెంబర్ 31) అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలను జరిపేందుకు జగన్ సర్కార్ సిద్దమయ్యింది. ఈ నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని వైన్స్ (wines), బార్ల (bars)లో రాత్రి సమయంలో ప్రతిరోజు కంటే ఎక్కువసమయం మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ఇవాళ (శుక్రవారం) ఉదయం 10గంటల నుంచి రాత్రి 12గంటల వరకూ రాష్ట్రంలోని బార్లు తెరిచివుంచేందుకు అనుమతించిన విషయం తెలిసిందే. అలాగే మద్యం దుకాణాలు (wine shops) కూడా ఉదయం  11 నుంచి రాత్రి 10 గంటల వరకూ తెరిచివుంచేందుకు అనుమతిచ్చారు. 

ALso Read:తెలంగాణ బాటలోనే ఏపీ... మందుబాబులను ఖుష్ చేసేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం

అయితే ఈ సమయాన్ని మరో గంట పెంచుతూ తాజాగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేసారు. రాష్ట్రంలోని బార్లు, రీటైల్ మద్యం దుకాణాలు, ఇన్ హౌస్ లో మద్యం విక్రయాల సమయాన్ని ఇప్పటికే ప్రకటించిన సమయానికి మరో గంటపాటు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే బార్లకు ఇవాళ అర్ధరాత్రి 1గంట వరకు, వైన్స్ లకు రాత్రి 11గంటల వరకు మద్యాన్ని విక్రయించేందుకు అనుమతించారు.

click me!