వంగవీటి రంగా లాగే రాధ హత్య... వైఎస్ జగన్ భారీ కుట్ర..: ఎమ్మెల్యే నిమ్మల సంచలనం

By Arun Kumar PFirst Published Dec 31, 2021, 5:01 PM IST
Highlights

 కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా హత్యను ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలాగయితే స్వార్థరాజకీయాలకు వాడుకున్నాడో అలాగే వంగవీటి రాధ హత్యను వాడుకోవాలని వైఎస్ జగన్ కుట్రలు పన్నుతున్నారని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు.  

అమరావతి: తెలుగుదేశం పార్టీ (TDP) నాయకుడు వంగవీటి రాధాకృష్ణ (vangaveeti radha) హత్యకు కుట్రలు పన్నుతున్నది స్వయంగా రాష్ట్ర ముుఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) అని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (nimmala ramanaidu) సంచలన వ్యాఖ్యలు చేసారు. కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా (vangaveeti mohanaranga murder) హత్యను ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి (ysr) ఎలాగైతే తన స్వార్థరాజకీయాలకు వాడుకున్నారో అలాగే వంగవీటి రాధ ను బలితీసుకుని తిరిగి అధికారంలోకి రావాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని నిమ్మల ఆరోపించారు. 

''దివంగత వంగవీటి మోహనరంగా గురించి, ఆయన తనయకుడు రాధా ఇంటి దగ్గర జరిగిన రెక్కీ గురించి, కాపుల బాగోగుల గురించి వైసీపీ నేతలు, ఆ ప్రభుత్వం మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, రాక్షసులు వేదపారాయణం చేసినట్లుగా ఉందని ఎమ్మెల్యే రామానాయుడు మండిపడ్డారు. 

''కాపులను (kapu community) ఎవరు ఆదరించి అభిమానిస్తున్నారో, ఎవరు అణగదొక్కుతున్నారో కాపులకే బాగా తెలుసు. కాపులకు టీడీపీ ప్రియమైన మిత్రువైతే,  వైసీపీ (ysrcp) బద్ధశత్రువు అనే పచ్చినిజాన్ని ఆ సామాజివర్గ ప్రజలు ఇప్పటికే గ్రహించారు. కాపులను టీడీపీ ఎంతగానో ఆదరించింది... కానీ వైసీపీ మాత్రం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆ వర్గాన్ని, ప్రముఖులైన నేతలను అణచివేసే పనిలోనే ఉంది'' అని ఆందోళన వ్యక్తం చేసారు. 

''ప్రస్తుత పరిస్థితుల్లో కాపువర్గంలో అమాయకులెవరూ లేరని ప్రభుత్వపెద్దలు, అధికారపార్టీవారు గుర్తిస్తే మంచింది. ఆనాడు నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మొదలు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి వరకు కాపులపై ఈర్ష్యాద్వేషాలతోనే వ్యవహరిస్తున్నారు. కాపుల రిజర్వేషన్లను రద్దుచేసి వారికి తీరని ద్రోహం, తీవ్ర అన్యాయం చేశారు. వాటన్నింటిని కాపులు గమనిస్తున్నారు'' అని నిమ్మల తెలిపారు. 

read more  వంగవీటి రాధా హత్యకు రెక్కీపై ఆధారాలు దొరకలేదు: విజయవాడ సీపీ క్రాంతి రాణా

''కాపువర్గాన్ని తీవ్రంగా అణచివేసి, సమాజంలో వారి ప్రాధాన్యతను తగ్గించడానికి గతంలో కొందరు పాలకులు ప్రయత్నించింది నిజం కాదా? వంగవీటి రంగా బొమ్మను అడ్డం పెట్టుకొని గెలిచిన ఆనాటి ప్రభుత్వాలు, పాలకులకంటే వెయ్యిరెట్లు అధికంగా ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కాపువర్గం ప్రాబల్యాన్ని తగ్గించడానికి, వర్గాల మధ్యవైషమ్యాలు రాజేస్తున్నారు'' అని తెలిపారు. 

''2004లో కాపులను బీసీల్లో చేర్చడంకోసం నియమించిన దాళ్వాయి సుబ్రమణ్యం కమిషన్ నిర్వహణకోసం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రూ.46లక్షలు అడిగితే నిర్లక్ష్యంగా వ్వవహరించారు. లక్షలు కాదు కదా కనీసం 4రూపాయలు కూడా ఇవ్వకుండా సుబ్రహ్మణ్యం కమిషన్ పనిచేయకుండా మోకాలడ్డాడు. దీంతో కాపుల రిజర్వేషన్ ప్రక్రియకు నిలిచిపోయింది. ఇలా ఆనాడు కాపులరిజర్వేషన్ ప్రక్రియ జరక్కుండా అడ్డుకున్నవారు నేడు కాపులను ఉద్ధరించేది తామేనన్నట్టు మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారు'' అని మండిపడ్డారు. 

''రంగా హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా చెప్పుకునే దేవినేని నెహ్రూని ఆదరించడమే కాదు అతనికి హైదరాబాద్ లో రూ.300 కోట్ల విలువైన భూములను రాజశేఖర్ రెడ్డి అప్పచెప్పారు. ఆనాడే అంతటి విలువైన భూములను నెహ్రూకి తన తండ్రి ఎందుకు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలడా? అలానే వంగవీటి రంగాను చంపడం తప్పుకాదని బహిరంగంగా చెప్పిన గౌతమ్ రెడ్డికి ఏపీ ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ పదవి ఇచ్చి ఎందుకు సత్కరించాడో ముఖ్యమంత్రి సమాధానం చెప్పగలడా?'' అని రామానాయుడు ప్రశ్నించారు. 

read more  వంగవీటి రాధా టీడీపీలో చేరడం ఇష్టంలేకే.. రెక్కీ : వైసీపీపై కళా వెంకట్రావు కామెంట్స్

''రంగా హత్యకేసులో దేవినేని నెహ్రూ ముద్దాయి అయితే ఆయన కుమారుడు దేవినేని అవినాష్ ని ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు అక్కున చేర్చుకోవడంలో అర్థమేమిటి?  రంగా కుమారుడు అయిన వంగవీటి రాధాని వైసీపీ ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించడమేగాక గత ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి మనస్సురాలేదు. ఆ విధంగా తన కుల అహంకారంతో కాపుల ప్రతినిధి అయిన రాధాను జగన్ అవమానించలేదా?'' అంటూ నిలదీసారు. 

''రాధా హత్యకు కుట్ర పన్ని రెక్కీ నిర్వహించిన అరవ సత్యం వైసీపీ విజయవాడ ఫ్లోర్ లీడర్ కాదా?  అదే అరవ సత్యం టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడిచేస్తే అతన్ని జగన్మోహన్ రెడ్డి ఆలింగనం చేసుకొని అభినందించింది నిజం కాదా?  టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడినప్పుడు అభినందించడం వల్లే అరవ సత్యం మరింత అత్యుత్సాహం ప్రదర్శించాడు. జగన్ కు మరింత దగ్గర కావాలన్న తాపత్రయంతో రాధా ఇంటివద్ద రెక్కీ నిర్వహించి తెగబడే ప్రయత్నం చేయడం నిజంకాదా? అరవ సత్యం చర్యలకు జగన్మోహన్ రెడ్డే బాధ్యత వహించాలి'' అని రామానాయుడు డిమాండ్ చేసారు. 

 

click me!