అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూపిస్తూ ఓ పెషెంట్ కు డాక్టర్లు ఓపెన్ బ్రెయిన్ సర్జరీ చేశారు. ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఆ పేషెంట్ రెండు చేతులూ జోడించి, ఆ నొప్పిలోనూ డాక్టర్లకు సహకరించారు. (Brain open surgery showing Ayodhya Ram's prana prathista ceremony on laptop) మధ్యలో జై శ్రీరాం అంటూ నినాదాలు చేయడం డాక్టర్లను ఆశ్చర్యానికి గురి చేసింది.
అయోధ్య రామ మందిర నిర్మాణం 500 ఏళ్ల నాటి హిందువల కల. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎట్టకేలకు ఈ ఏడాది ఆ కల సాకారం అయ్యింది. జనవరి 22వ తేదీన ఘనంగా ఆ ఆలయం ప్రారంభమయ్యింది. అదే రోజు బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది. దేశ ప్రజలందరి తరుఫున ప్రధాని నరేంద్ర మోడీ బాలక్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి భక్తులు, ప్రముఖులు తరలివచ్చారు.
అయితే ఎంతో మందికి ఆరోజు అక్కడికి వెళ్లాలని ఉన్నా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తితో వెళ్లలేదు. దీంతో దేశ, విదేశాల్లో ఈ కార్యక్రమాన్ని టీవీలు, య్యూటూబ్, సోషల్ మీడియాల ద్వారా వీక్షించారు. ఆ సుందరమైన, మనోహరమైన బాల రాముడి రూపం చూసి తరించిపోయారు. భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఆ వీడియోలు ఇప్పటికీ అందుబాటులో ఉండటంతో ఎంతో మంది వాటిని చూస్తూ ఆధ్యాత్మికతలో మునిగిపోతున్నారు.
ఏసీబీకి చిక్కిన ఎస్ఈ జగజ్యోతి.. ఇంట్లో రూ.65 లక్షలు, 2.5 కేజీల బంగారం లభ్యం.. కన్నీటి పర్యంతం
ఆ వీడియోలు ఇప్పుడు ఆపరేషన్ సమయంలో నొప్పిని నుంచి దృష్టిని మరల్చడానికి, మెడిసిన్ గా కూడా వాడుతున్నారంటే నమ్ముతారా.. ? అవును.. ఏపీలోని గుంటూరులో మొదడుకు ఓపెన్ సర్జరీ చేసే సమయంలో అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలను చూపించారు. రోగికి పూర్తి స్థాయి మత్తులో ఉంచకుండా, స్పృహలో ఉంచే ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు ఈ విధానాన్ని అనుసరించారు.
అసలేం జరిగిందంటే ?
గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన దానబోయిన మణికంఠకు మొదడులో కణితి ఏర్పడింది. దీంతో ఆయన శ్రీసాయి హాస్పిటల్ కు వెళ్లగా.. ఆపరేషన్ చేసి, దానిని తొలగించాలని డాక్టర్లు నిర్ణయించారు. ఈ ఆపరేషన్ సున్నితమైన మెదడుకు సంబంధించినది కాబట్టి.. కణితిని తొలగించే క్రమంలో కాళ్లు, చేతులు చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే రోగిని మెలుకువగా ఉంచి సర్జరీ చేయాలని డాక్టర్లు నిర్ణయానికి వచ్చారు.
Mystery : శివపురి అడవిలో వందలాది ఆవుల మృతదేహాలు.. అసలేం జరిగింది..?
అయితే పేషెంట్ శ్రీరాముడి భక్తుడు కావడంతో డాక్టర్లకు పని మరింత సులభం అయిపోయింది. ఫిబ్రవరి 11వ తేదీన ఈ ఓపెన్ సర్జరీ ప్రారంభించారు. ఆ సమయంలో ల్యాప్ టాప్ లో అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూపిస్తూ సర్జరీ మొదలుపెట్టారు. ఈ సమయంలో రోగి శ్రీరాముడిని చూస్తూ, రెండు చేతులు జోడించి భక్తిలో మునిగిపోయారు. మధ్యలో జై శ్రీరామం అంటూ నినాదాలు చేయడం డాక్టర్లకు కూడా ఆశ్చర్యం కలిగించింది. అంత నొప్పిలోనూ డాక్టర్లకు సహకరించారు. దీంతో డాక్టర్లు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఆయనకు పూర్తిగా నయం అవ్వడంతో సోమవారం ఇంటికి పంపించారు.