ఏపి రాజధానిపై నిన్న లిఖితపూర్వక సమాధానమిచ్చి అందరి అనుమానాలను పటాపంచలు చేసిన మంత్రి బొత్స మరో బాంబు పేల్చారు.అమరావతి విషయంలో అసెంబ్లీ నిర్ణయమే ఫైనల్ అని తాజాగా పేర్కొన్నారు.
విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను అందించిన రైతులకు వైసిపి ప్రభుత్వం అండగా వుంటుందని... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పురపాలకక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. అయితే రాజధాని విషయంపై మరోసారి స్పందించిన మంత్రి అసెంబ్లీలో చర్చించిన తర్వాతే స్పష్టత వస్తుందన్నారు. అప్పటివరకు అందరు సంయమనంతో వుండాలని మంత్రి సూచించారు.
అమరావతిలో ఇప్పటికే ప్రారంభించిన భవనాలు, నిర్మాణ దశలో ఉన్న కట్టడాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసెంబ్లీలో దుర్భాషలాడుతూ సభను సజావుగా జరగనివ్వడం లేదని మంత్రి మండిపడ్డారు. టిడిపి నేతలు రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారని ఆరోపించారు.
undefined
ఏపిలో మహిళలు,బాలికలకు రక్షణ కల్పించడానికే దిశ యాక్ట్ తీసుకువచ్చామని అన్నారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలటీల్లో వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.
విశాఖ మెట్రోను రెండు ఫేస్ లుగా చేయాలని నిర్ణయించిట్లు తెలిపారు. అలాగే భోగాపురం ఎయిర్ ఫోర్టు మరల టెండరుకు వెళ్ళాలా అనే విషయంపై ఆలోచనలు చేస్తున్నామని మంత్ర బొత్స వెల్లడించారు.
read more టీడీపీ ఇచ్చినదానికి మీరెలా రూలింగ్ ఇస్తారు : శాసన మండలి చైర్మన్ పై బొత్స అసహనం
శుక్రవారం శాసన మండలిలో టిడిపి ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సూటిగా సమాధానం చెప్పారు. రాజధానిని అమరావతి నుంచి ఎక్కడికీ మార్చడం లేదని లిఖితపూర్వకంగా మంత్రి సమాధానమిచ్చారు. దీంతో మొదటిసారి ప్రభుత్వం తరపున రాజధాని మార్పుపై స్పష్టమైన ప్రకటన వెలువడినట్లయింది.
రాజధాని అమరావతి నిర్మాణంపై రాష్ట్ర ప్రజల్లో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన రాజధాని నిర్మాణ పనులను నూతన వైసిపి ప్రభుత్వం కొనసాగిస్తుందా అన్న అనుమానం మొదలయ్యింది. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు కూడా అమరావతి గురించి పలుమార్లు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిని శ్మశానంతో పోల్చడం వివాదాస్పదమయ్యింది. అలాగే చంద్రబాబు రాజధాని పర్యటన, జరిగిన పరిణామాలు రాజకీయ ప్రకంపణలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో బొత్స అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనతో అందరి సందేహాలకు సమాధానం లభించాయి.
read more స్మశానంలా రాజధాని అమరావతి...అన్నది నిజమే, కానీ..: అసెంబ్లీలో బొత్స
అయితే తాాాజాగా ఆయన రాష్ట్ర ప్రజలను మరోసారి కన్ప్యూజన్ లోకి నెట్టారు. తన మాటలు ఎలా వున్నా రాష్ట్ర రాజధానిపై నిర్ణయం తీసుకోవాల్సింది అసెంబ్లీయేనని..అక్కడ చర్చ తర్వాతే దానిపై స్పష్టత రానుందంటూ మంత్రి వెల్లడించారు.