నా బిడ్డని చంపిందెవరో రోజాకి తెలుసు.. ఆయేషా మీరా తల్లి సంచలన కామెంట్స్

Published : Dec 14, 2019, 09:23 AM IST
నా బిడ్డని చంపిందెవరో రోజాకి తెలుసు.. ఆయేషా మీరా తల్లి సంచలన కామెంట్స్

సారాంశం

దేశంలో న్యాయం ఉందన్న నమ్మకం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయంకోసం 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నామన్నారు.


విజయవాడ ఆయేషా మీరా హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. శనివారం ఉదయం తెనాలి చంచుపేటలో ఆయేషా మీరా మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో... ఆయేషా తల్లి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ప్రస్తుత నగరి ఎమ్మెల్యే రోజా సంచలన కామెంట్స్ చేశారు.

తన కూతురు హత్య జరిగిన సమయంలో రోజా చాలా హడావిడి చేశారని... ఇప్పుడు మాత్రం నోరు విప్పడం లేదని  ఆయేషా మీరా తల్లి పేర్కొన్నారు. తన బిడ్డను హత్య చేసిన నిందితులు ఎవరో ఎమ్మెల్యే రోజా కి తెలుసంటూ ఆమె సంచలన కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం సీఎం జగన్ దిశ చట్టాన్ని తీసుకువస్తూ... మహిళలపై అత్యాచారం జరిగితే కేవలం 21 రోజుల్లో నిందితులను పట్టుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయేషా కేసును కూడా పరిగణలోనికి తీసుకోవాలన్నారు. దేశంలో న్యాయం ఉందన్న నమ్మకం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయంకోసం 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నామన్నారు.

ఇప్పటికీ తమకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. నిందితుల పేర్లు బయటపెడుతుంటే.. మా పై రూ.కోటి పరువు నష్టం కేసు వేస్తామని బెదిరిస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిజా నిజాలు బయటపెడితే... ఎవరు పరువు నష్టం చెల్లించాల్సి వస్తుందో తెలుస్తుందన్నారు.

2007 డిసెంబర్‌లో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఆయేషా మీరా దారుణహత్య జరిగింది. అప్పట్నుంచీ ఈ కేసులో ప్రతీ మలుపు సంచలనంగా మారింది. చివరకు ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్యం బాబును 2017 మార్చి 31న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆయేషా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషి అని తేలాడు కానీ... అసలు దోషులెవరో బయటపడలేదు. ఈ హత్య జరిగినప్పుడు ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu