రాజధానిపై మధ్యంతర నివేదికను బోస్టన్ కన్సల్టింగ్ కమిటీ మధ్యంతర నివేదికను అందించింది.
అమరావతి: రాజధానిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మధ్యంతర నివేదికను శనివారం నాడు రాష్ట్రప్రభుత్వానికి అందించింది. తుది నివేదికను త్వరలోనే అందించే అవకాశం ఉంది. జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చిన మరునాడే బోస్టన్ కన్సల్టింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది.
Also read:రాజధానిపై జీఎన్ రావు కమిటీ: అమరావతిలో కొనసాగుతున్న ఆందోళనలు, ఉద్రిక్తత
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వానికి శనివారం నాడు నివేదికను అందించింది. గ్రీన్ ఫీల్డ్ రాజధాని కంటే బ్రౌన్ ఫీల్డ్ రాజధాని ఏర్పాటు చేయాలని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అభిప్రాయపడింది. బ్రౌన్ ఫీల్డ్ రాజధాని వల్లే సత్వరంగా అభివృద్ది చెందే అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడింది.
Also read:నివేదికపై భగ్గుమన్న అమరావతి.. జగన్‌ది అన్యాయమంటూ నినాదాలు
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అసెంబ్లీ వేదికపైనే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనం చేస్తుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ ప్రకటన చేసిన నాలుగైదు రోజుల తర్వాతే బోస్టన్ కన్సల్టింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది.
Also Read:అమరావతి కుదింపు, వికేంద్రీకరణ ప్లాన్ ఇదీ: జీఎన్ రావు
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కూడ రాజధానిపై అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రాజధానిలో సాంకేతిక అంశాలపై కూడ ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది.ఈ కమిటీ నివేదిక తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.