జగన్‌ బర్త్‌డే: కేక్ కట్ చేసి గ్రీటింగ్స్ చెప్పిన మంత్రులు, అధికారులు

Published : Dec 21, 2019, 11:12 AM ISTUpdated : Dec 21, 2019, 11:46 AM IST
జగన్‌ బర్త్‌డే: కేక్ కట్ చేసి గ్రీటింగ్స్ చెప్పిన మంత్రులు, అధికారులు

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు పుట్టిన రోజును పురస్కరించుకొని పలువురు మంత్రులు, అధికారులు శనివారం నాడు శుభాకాంక్షలు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకొని పలువురు మంత్రులు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Also read:నివేదికపై భగ్గుమన్న అమరావతి.. జగన్‌ది అన్యాయమంటూ నినాదాలు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. దీంతో తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో  పలువురు మంత్రులు, అధికారులు జగన్‌కు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Also read:రాజధానిపై జీఎన్ రావు కమిటీ: అమరావతిలో కొనసాగుతున్న ఆందోళనలు, ఉద్రిక్తత

కేక్‌ తినిపించారు. శుక్రవారం సాయంత్రం కూడ ఏపీ సీఎం జగన్‌కు ఓ కార్యక్రమంలో మంత్రులు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు.తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్ తో పాటు  పలువురు అధికారులు  జగన్ కు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. 

Also Read:వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్: చంద్రబాబుకు 'ప్రాంతీయ' చిక్కులు

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu