కృష్ణమ్మ ఉగ్రరూపం, నాటు పడవ బోల్తా: 11ఏళ్ల బాలిక గల్లంతు

By Nagaraju penumalaFirst Published Aug 16, 2019, 5:41 PM IST
Highlights

చెవిటికళ్లు గ్రామస్థులు తయారు చేసుకున్న నాటుపడవలో ఆరుగురు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందకు ప్రయత్నించారు. ఇంతలో తో చెవిటికళ్లు గ్రామానికి చెందిన ఆబోటు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. దాంతో గౌతమి ప్రియ అనే 11ఏళ్ల చిన్నారి గల్లంతైంది. ఈ ప్రమాదం నుంచి ఐదుగురు ప్రాణాలతో బయటపడగా గౌతమి ప్రియ మాత్రం ఒడ్డుకు చేరుకోలేకపోయింది. 

విజయవాడ: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుతోంది. వదర ప్రభావంతో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 

గత కొద్దిరోజులుగా కృష్ణా జిల్లాలోని చెవిటికళ్లు గ్రామం వరదలో చిక్కుకుపోయింది. రెండు రోజుల నుంచి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకపోయాయి. దాంతో ఎలాగైనా సురక్షిత ప్రాంతాలకు చేరాలనే ఉద్దేశంతో నాటు పడవను ఆశ్రయించి ఒక చిన్నారి నదిలో గల్లంతయిన పరిస్థితి నెలకొంది. 

చెవిటికళ్లు గ్రామస్థులు తయారు చేసుకున్న నాటుపడవలో ఆరుగురు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందకు ప్రయత్నించారు. ఇంతలో తో చెవిటికళ్లు గ్రామానికి చెందిన ఆబోటు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. దాంతో గౌతమి ప్రియ అనే 11ఏళ్ల చిన్నారి గల్లంతైంది. 

ఈ ప్రమాదం నుంచి ఐదుగురు ప్రాణాలతో బయటపడగా గౌతమి ప్రియ మాత్రం ఒడ్డుకు చేరుకోలేకపోయింది. దాంతో చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇకపోతే నాటుపడవ సామర్థ్యం మించి ఎక్కడం వల్ల ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెప్తున్నారు.  

ఇకపోతే చెవిటికళ్లు గ్రామంలో వరద ప్రభావంతో దారుణమైన పరిస్థితి చోటు చేసుకుందని బాధితులు వాపోతున్నారు. వరద ప్రభావంతో గత రెండురోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు.  

తమ గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకుపోయినా తమను కాపాడేందుకు ఒక బోటును కూడా ఏర్పాటు చేయలేదంటూ ప్రజలు బోరున విలిపిస్తున్నారు. తమ గ్రామంలో ఒక వ్యక్తి చనిపోయారని ఆ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు కూడా నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. 

బోటు లేకపోవడంతో లారీ టైర్లను కట్టుకుని అతికష్టంమీద శవాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించినట్లు వారు తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి తమ గ్రామస్థులను ఆదుకోవాలని చెవిటికళ్లు ప్రజలు కోరుతున్నారు. 
 

click me!