అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్: పరిహారం చెల్లింపు ప్లాన్ ఇదీ

By narsimha lodeFirst Published Jan 3, 2019, 3:14 PM IST
Highlights

అగ్రిగోల్డ్ బాధితులకు పరిహరం చెల్లించేందుకు వీలుగా ఏపీ సర్కార్ ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ నెలాఖరు లోపుగా రూ.5 వేల నుండి రూ. 20 వేలలోపు పరిహారాన్ని చెల్లించాలని సర్కార్ భావిస్తోంది.


అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు పరిహరం చెల్లించేందుకు వీలుగా ఏపీ సర్కార్ ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ నెలాఖరు లోపుగా రూ.5 వేల నుండి రూ. 20 వేలలోపు పరిహారాన్ని చెల్లించాలని సర్కార్ భావిస్తోంది.

ఏపీ రాష్ట్రంలో  అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ఇవాళ ధర్నా నిర్వహించారు.రాష్ట్రంలో ఉన్న అటాచ్ కాని అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. 

 ఈ మేరకు కోర్టులో  అఫిడవిట్ దాఖలు చేయనుంది.గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన  ఈ విషయమై కేసు విచారణకు రావాల్సి ఉంది. కానీ, కోర్టు విభజన కారణంగా  ఆ రోజు ఈ కేసు విచారణ జరగలేదు.

ఈ నెల 21 వ తేదీ లోపుగా కోర్టులో కేసు విచారణకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.దీంతో ఇంకా అటాచ్ కాని ఆస్తులను ప్రభుత్వం కోనుగోలు చేయాలని సర్కార్ భావిస్తోంది.

 సుమారు రూ. 300 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేయనుంది. ఈ నెలాఖరులోపుగా బాధితులకు పరిహారం చెల్లించాలని సర్కార్ యోచిస్తోంది.ఐదు నుండి  20 వేల లోపు పరిహరాన్ని  ఈ నెలాఖరులోపుగా చెల్లించాలని సర్కార్ భావిస్తోంది.

ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనుంది.అగ్రిగోల్డ్ బాధిత సంఘంతో కూడ ఈ విషయమై చర్చించనుంది. ఈ మేరకు ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మీడియాకు తెలిపారు.

click me!