విజయసాయిరెడ్డివి చిల్లర పనులు: రాష్ట్రపతి లేఖపై స్పందించిన సుజనా

By sivanagaprasad KodatiFirst Published Dec 24, 2019, 8:54 PM IST
Highlights

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ లేఖ రాశారని ఆయన పేర్కొన్నారు

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ లేఖ రాశారని ఆయన పేర్కొన్నారు.

సెప్టెంబర్ 26న తనపై రాష్ట్రపతికి లేఖ రాస్తే నవంబర్ 6న రాష్ట్రపతి కార్యాలయం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపించారని సుజనా తెలిపారు. ఏ పౌరుడు రాష్ట్రపతికి లేఖ రాసినా.. ఆర్జీ పెట్టుకున్నా.. రాష్ట్రపతి కార్యాలయం సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపడం రివాజని సుజనా గుర్తుచేశారు.

Also Read:సుజనాకు చిక్కులు: విజయసాయి లేఖపై స్పందించిన రాష్ట్రపతి

ఇందులో భాగంగానే తనపై రాసిన లేఖ హోంమంత్రిత్వ శాఖకు చేరిందన్నారు. తన బిజినెస్ కెరియర్, పొలిటికల్ కెరియర్ తెరిచిన పుస్తకమని సుజనా చౌదరి స్పష్టం చేశారు. తనపై ఏ విధమైన కేసులు లేవని, తన పేరుప్రతిష్టలు దిగజార్చడానికే విజయసాయిరెడ్డి చిల్లర పనులు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. 

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై  ఉన్న ఆర్ధిక నేరాలపై ఈడీ, సీబీఐలతో విచారణ చేయించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు.  ఈ లేఖను హోంమంత్రిత్వశాఖకు రాష్ట్రపతి కార్యాలయం నుండి పంపారు.

సుజనా చౌదరి మనీలాండరింగ్, ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపించింది.ఈ మేరకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ రాశారు. రాష్ట్రపతి కార్యాలయం నుండి ఈ లేఖను కేంద్ర హోంశాఖకు పంపారు.రాష్ట్రపతి కార్యాలయం నుండి తమకు లేఖ అందిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుండి లేఖ అందింది.

Also Read:వ్రతం చెడ్డా దక్కని ఫలితం : సుజనా చౌదరికి షాక్

సుజనా చౌదరి గత టర్మ్‌లో మోడీ ప్రభుత్వం మంత్రిగా పనిచేశారు. ఏపీకి  ప్రత్యేక హోదాతో పాటు నిధుల కేలాయింపులో అన్యాయం చేశారని ఆరోపిస్తూ టీడీపీ మోడీ మంత్రివర్గం నుండి బైటకు వచ్చింది.టీడీపీ నుండి మంత్రులుగా పనిచేసిన సుజనా చౌదరి, ఆశోక్‌గజపతిరాజులు వైదొలగారు. 

ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత సుజనా చౌదరి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. రాజ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీని బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విలీనం చేశారు.

click me!