లాయర్ల మధ్య కర్నూలు చిచ్చు: రెండుగా చీలిన ఏపీ హైకోర్టు బార్‌ అసోసియేషన్

By sivanagaprasad Kodati  |  First Published Dec 24, 2019, 6:40 PM IST

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జనరల్ బాడీ సమావేశం రసాభాసగా మారింది. రెండు వర్గాలుగా విడిపోయిన న్యాయవాదులు హైకోర్టు తరలింపు విషయంలో కొందరు ప్రభుత్వానికి మద్ధతుగా, మరికొందరు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సమావేశం రచ్చరచ్చగా మారింది. 


ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జనరల్ బాడీ సమావేశం రసాభాసగా మారింది. రెండు వర్గాలుగా విడిపోయిన న్యాయవాదులు హైకోర్టు తరలింపు విషయంలో కొందరు ప్రభుత్వానికి మద్ధతుగా, మరికొందరు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సమావేశం రచ్చరచ్చగా మారింది.

హైకోర్టును కర్నూలుకు తరలించకూడదని... హైకోర్ట్ బార్ అసోసియేషన్ తీర్మానించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 26, 27 తేదీల్లో విధులు బహిష్కరించాలని న్యాయవాదులు నిర్ణయించారు.

Latest Videos

Also Read:ఏపీలో మూడు రాజధానులు: లాయర్లు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న టీడీపీ నేత

హైకోర్టును కర్నూలుకు తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే బెజవాడ బార్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆరు జిల్లాల బార్ అసోసియేషన్‌లు ఒక జేఏసీగా ఏర్పడి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

ఆంధ్రప్రదేశ్ రాజధానిని మూడు ప్రాంతాల్లో పెట్టాలన్న జీఎన్ రావు కమిటీ నివేదిక నేపథ్యంలో అనంతపురం జిల్లా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు మూడు రాజధానులు ఏర్పడితే న్యాయవాదులు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి ఉంటుందంటూ వ్యాఖ్యానించారు.

సోమవారం అనంతలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కర్నూలులో హైకోర్టు, విజయవాడ, విశాఖలో హైకోర్టు బెంచ్‌ల్లో లాయర్లు పనిచేయాలంటే ఒక్కొక్కరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్నారు.

Also Read:కర్నూల్ కష్టమే...ఆ కోటాలో రాజధానిగా తిరుపతి: మాజీ ఎంపీ

కర్నూలులో హైకోర్టు కాకుండా రాజధానిని నిర్మించాలని పార్థసారథి డిమాండ్ చేశారు. కాగా ఆయన వ్యాఖ్యలపై న్యాయవాదులు భగ్గుమన్నారు. పార్థసారథి వ్యాఖ్యలు తమను అవమానించేలా ఉన్నాయని, వెంటనే తమకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

click me!