నిమ్మగడ్డ కలిస్తే వైసీపీ ఎందుకు భయపడుతోంది: సుజనా కామెంట్స్

By narsimha lodeFirst Published Jun 24, 2020, 12:17 PM IST
Highlights

తనను, నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ లు కలిస్తే వైసీపీ ఎందుకు భయపడుతోందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ప్రశ్నించారు.
 

హైదరాబాద్:  తనను, నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ లు కలిస్తే వైసీపీ ఎందుకు భయపడుతోందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ప్రశ్నించారు.

పార్క్ హయత్ హోటల్ లో చోటు చేసుకొన్న ఘటనలపై ఆయన  ట్విట్టర్ వేదికగా సుజనా చౌదరి వైసీపీపై ప్రశ్నల వర్షం కురిపించారు.మేం కలిస్తే తప్పేంటి అని ఆయన అడిగారు.

also read:రహస్య సమావేశం కాదు, నిమ్మగడ్డతో కుటుంబ స్నేహం: సుజనా

తాను పారదర్శకంగానే రాజకీయాలు చేస్తానని చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అసలు ఎన్నికల సంఘం కమిషనర్ గా గుర్తించారా.. కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.

రమేష్ కుమార్ ని ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగిస్తున్నామని మీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తుంది. రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా వుండి ఎంపిని కలవడంలో మతలబేంటని మీ సాక్షి మీడియా ఆశ్చర్యపోతుంది. ఇంతకీ ఆయన్ను మీరు కమిషనర్ గా గుర్తించారా? కోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నారా?

— YS Chowdary (@yschowdary)

నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, కామినేని శ్రీనివాస్. గారు పార్క్ హయత్ లోని నా కార్యాలయానికి వచ్చినందుకే నానా హైరానా పడుతున్నారు. మేం కలిస్తే తప్పేంటి? మీకు అంత భయం దేనికి? కంగారొద్దు. నా రాజకీయాలు పారదర్శకంగా వుంటాయి. నేనేదైనా చెప్పే చేస్తా.

— YS Chowdary (@yschowdary)

 

ఈ నెల 13వ తేదీన హైద్రాబాద్ పార్క్ హయత్ హోటల్ లో ఈ ముగ్గురు కలిశారు. ముగ్గురు నేతలు రహస్యంగా కలిశారని వైసీపీ విమర్శలు గుప్పించింది. అయితే తాము రహస్యంగా కలవలేదని సుజనా చౌదరి మంగళవారం నాడు రెండు వేర్వేరు పత్రికా ప్రకటనల్లో వివరించారు.

ఈ ప్రకటనకు కొనసాగింపుగానే  ట్విట్టర్ వేదికగా సుజనా చౌదరి వైసీపీకి ప్రశ్నల వర్షం కురిపించారు. 


 

click me!