అర్హులందరికి సంక్షేమ పథకాలు: జగన్

By narsimha lodeFirst Published Jun 24, 2020, 11:48 AM IST
Highlights

కాపు నేస్తం కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు అమరావతిలో ప్రారంభించారు.  క్యాంపు కార్యాలయం నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
 

అమరావతి: కాపు నేస్తం కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు అమరావతిలో ప్రారంభించారు.  క్యాంపు కార్యాలయం నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

45 ఏళ్ల నుండి 60 ఏళ్లలోపు అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి రూ. 15 వేల ఈ పథకం కింద అందించనున్నారు.  2లక్షల 35వేల 873 మంది కాపు మహిళలకు రూ. 354 కోట్ల లబ్ది చేకూరనుంది. వైఎస్ ఆర్ కాపు నేస్తం ద్వారా వచ్చే ఐదేళ్లలో కాపు మహిళలు రూ. 75 వేలు  లబ్దిపొందనున్నారని సీఎం చెప్పారు.

గత 13 నెలలుగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టుగా ఆయన గుర్తు చేశారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని జగన్ చెప్పారు.

లబ్దిదారుల జాబితాలో పేరు లేకపోయినా కూడ మళ్లీ ధరఖాస్తు చేసుకోవచ్చని సీఎం తెలిపారు.  గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 1800 కోట్లను కూడ ఖర్చు పెట్టలేదని ఆయన విమర్శించారు. కానీ, తమ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.4700 కోట్లను వివిధ పథకాల ద్వారా అందించినట్టుగా ఆయన వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16వతేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కాపు నేస్తం పథకం గురించి ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రస్తావించిన విషయం తెలిసిందే. 
 

click me!