విశాఖ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు: ధన్యవాదాలు తెలిపిన గంటా

Published : Mar 10, 2021, 03:20 PM IST
విశాఖ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు: ధన్యవాదాలు తెలిపిన గంటా

సారాంశం

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి మద్దతు ప్రకటించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ కు  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన ధన్యవాదాలు తెలిపారు.  

విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి మద్దతు ప్రకటించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ కు  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

బుధవారం నాడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ను వంద శాతం ప్రైవేటీకరిస్తామనగానే కార్మికులు ఆందోళన బాట పట్టారని ఆయన చెప్పారు.

ఈ ప్లాంట్ విషయమై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి స్టీల్ ప్లాంట్ పై స్పష్టత ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.స్టీల్ ప్లాంట్ ఫైనాన్స్ డైరెక్టర్ తో పాటు సీనియర్ ఉద్యోగులను కార్మికులు నిర్భంధించారన్నారు. రోజు రోజుకి ఈ ఉద్యమం మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయన్నారు.

అఖిలపక్షంతో పాటు కార్మిక సంఘాలను కూడ ప్రధాని వద్దకు తీసుకెళ్లేందుకు సీఎం జగన్ స్వాగతించడంపై ఆయన హర్షం ప్రకటించారు.ప్రజల అభీష్టానికి విరుద్దంగా తీసుకొన్న నిర్ణయంపై కేంద్రానికి ప్రజల ఆగ్రహం తెలవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్