బీజేపీకి కన్నా రాజీనామా : వ్యాఖ్యానించేందుకు నిరాకరించిన జీవీఎల్

Published : Feb 16, 2023, 01:06 PM ISTUpdated : Feb 16, 2023, 01:15 PM IST
బీజేపీకి కన్నా రాజీనామా : వ్యాఖ్యానించేందుకు  నిరాకరించిన  జీవీఎల్

సారాంశం

బీజేపీకి  మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ  రాజీనామా  విషయమై  పార్టీ  నాయకత్వం  స్పందిస్తుందని   ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు  చెప్పారు.   

గుంటూరు::బీజేపీకి  మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ  రాజీనామాపై బీజేపీ  ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆసక్తి  చూపలేదు.  బీజేపీకి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ  రాజీనామా అంశంపై   స్పందించేందుకు  బీజేపీ  ఎంపీ జీవీఎల్ నరసింహరావు  ఆసక్తి చూపలేదు.  పార్టీ నాయకత్వం  ఈ విషయమై స్పందించనుందని ఆయన  చెప్పారు.  

బీజేపీకి  కన్నా లక్ష్మీనారాయణ  రాజీనామా: స్పందించేందుకు  నిరాకరించిన  జీవీఎల్ గుంటూరు:   బీజేపీకి  మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ  రాజీనామాపై  స్పందించేందుకు   ఆ పార్టీ ఎంపీ  జీవీఎల్ నరసింహరావు   నిరాకరించారు.  

గురువారం నాడు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు   గుంటూరులో  మీడియాతో మాట్లాడారు.  కన్నా లక్ష్మీనారాయణ  బీజేపీకి రాజీనామా  చేస్తారనే  విషయమై  మీడియా ద్వారా సమాచారం తెలిసిందన్నారు. ఈ విషయమై  పార్టీ  నాయకత్వం   స్పందిస్తుందని  జీవీఎల్  నరసింహరావు  చెప్పారు. పార్టీ నాయకులు   ఈ విషయమై  చర్చించి  నిర్ణయాన్ని ప్రకటించనున్నారని చెప్పారు. 

also read:పగ, కక్షసాధింపే సోము వీర్రాజు లక్ష్యం: బీజేపీకి రాజీనామా తర్వాత కన్నా

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తీరుపై  కన్నా లక్ష్మీనారాయణ   సీరియస్ విమర్శలు  చేశారు. జీవీఎల్ నరసింహరావు  ఏం చేశారని కాపు నేతలు  ఆయనకు సన్మానాలు చేస్తున్నారని  ప్రశ్నించారు. 

గత కొంతకాలంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ  పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరుపై  విమర్శలు  చేస్తున్నారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై కన్నా లక్ష్మీనారాయణ మీడియా వేదికగా  కూడా విమర్శలు  చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Vizag Police Commissioner: తాగి రోడ్డెక్కితే జైలుకే విశాఖ పోలీస్ హెచ్చరిక | Asianet News Telugu