ఏపీలో కాపులు రాజకీయంగా నష్టపోయారు: బీజేపీ ఎంపీ జీవీఎల్

By narsimha lodeFirst Published Jan 5, 2022, 12:07 PM IST
Highlights

ఏపీలో కాపు సామాజిక వర్గం రాజకీయంగా నష్టపోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. న్యూడిల్లీలో బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

న్యూఢిల్లీ: ఏపీలో కాపు సామాజిక వర్గం రాజకీయంగా నష్టపోయిందని bjp  ఎంపీ  GVL Narasimha Rao  అభిప్రాయపడ్డారు.బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి కేంద్రం విస్తృతంగా నిధులు ఇస్తోందని చెప్పారు. Visahka steel plant , polavaram అంశాలపై  కేంద్రాన్ని సీఎం వైఎస్ జగన్ అడిగినట్టు  తాను ఎక్కడా వినలేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే పోలవరం ప్రాజెక్టును  తామే పూర్తిగా నిర్మిస్తామని చెప్పారు.

ఏపీలో kapu సామాజిక వర్గానికి చెందిన పలు పార్టీలకు చెందిన నేతలు hyderabad లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు విషయమై చర్చించారు. రెండు దఫాలు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు సమావేశమై ఈ విషయమై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో  Chiranjeevi, Pawan Kalyan లు పార్టీ ఏర్పాటు చేసి విఫలమయ్యారని కొందరు చేసిన వ్యాఖ్యలు కూడా ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి.

కాపులు రాజకీయంగా నష్టపోయారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారి తీశాయి. అయితే నిన్ననే బీసీ, దళిత, కాపులు రాజ్యాధికారం కోసం బ్లూ ప్రింట్ తయారు చేయాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కోరారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. 

ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు రాజకీయంగా ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు విషయమై జరిపిన చర్చలపై కాపు నేత చేగోండి హరిరామజోగయ్య  కూడా కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతల సమావేశం వెనుక  వైసీపీ వ్యూహాంలో భాగంగా జరిగిందా అని ఆయన ప్రశ్నించారు.

also read:ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం కావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గానికి ఆ పార్టీ పెద్దపీట వేస్తోంది. గతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ తర్వాత అదే సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజును బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు రాజకీయాధికారం కోసం ఇటీవల సమావేశాలు నిర్వహించడంపై టీడీపీ, వైసీపీలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి.  రాజ్యాధికారం దక్కించుకొనేందుకు కాపు నేతలు భవిష్యత్తులో ఏ రకమైన వ్యూహాంతో ముందుకు వెళ్తాయనే దానిపై కూడా ప్రధాన రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు సుమారు 12 శాతం ఉంటారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎటువైపు  మొగ్గు చూపితే  ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.  గత ఎన్నికల్లో తాము అధికారానికి దూరం కావడానికి కాపులు, బీసీలు దూరం కావడం కూడా కారణమని టీడీపీ నేతలు తమ అంతర్గత సమావేశాల్లో చెప్పుకొంటున్నారు.ఈ సమయంలో కాపులు ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు విషయమై చర్చించడంపై కూడా టీడీపీ నిశితంగా పరిశీలిస్తోంది.

click me!