ఏలూరులో దారుణం: భర్త సోదరుడితో వివాహేతర సంబంధం... ప్రియుడితో కలిసి మహిళ ఆత్మహత్య (Video)

Arun Kumar P   | Asianet News
Published : Jan 05, 2022, 12:00 PM ISTUpdated : Jan 05, 2022, 12:14 PM IST
ఏలూరులో దారుణం: భర్త సోదరుడితో వివాహేతర సంబంధం... ప్రియుడితో కలిసి మహిళ ఆత్మహత్య  (Video)

సారాంశం

కట్టుకున్న భర్త సోదరుడితోనే వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్న ఓ మహిళ చివరకు అతడితో కలిసి బలవన్మరణానికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. 

ఏలూరు: వివాహేతర సంబంధానికి (extramarrital affair) రెండు నిండు ప్రాణాలు బలయిన విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లా (west godavari district)లో చోటుచేసుకుంది. తమ అక్రమ సంబంధం గురించి కుటుంబసభ్యులకు తెలియడం అవమానంగా భావించిందో ఏమో తెలీదుగానీ ప్రియుడితో కలిసి వివాహిత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. 

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు (eluru)లో నివాసముంటున్న దంపతుల కాపురం ఎంతో అన్యోన్యంగా సాగుతున్న సమయంలో అక్రమబంధం చిచ్చుపెట్టింది. కట్టుకున్న భర్తకు సోదరుడి వరసయ్యే వ్యక్తితో వివాహిత చనువుగా వుండేది. ఈ క్రమంలోనే ఒకరంటే ఒకరికి ఇష్టం పెరిగి ప్రేమగా మారింది. అదికాస్తా వివాహేతన సంబంధానికి దారితీసింది. సొంత పిన్ని కొడుకే కాబట్టి భార్యతో చనువుగా వున్నా భర్తకు పెద్దగా అనుమానం కలగలేదు. 

Video

అయితే ఇటీవల వీరి అక్రమసంబంధం గురించి కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అయితే తాను ఇష్టపడిన వ్యక్తిని మరిచిపోలేక... భర్తతో కలిసి వుండలేక తీవ్ర వేధనకు గురయిన వివాహిత చివరకు దారుణానికి పాల్పడింది.

read more  పెళ్లి చేసుకుంటానని సచివాలయంలో పనిచేసే యువతికి శారీరకంగా దగ్గరైన కానిస్టేబుల్.. కానీ చివరకు..

మంగళవారం రాత్రి కుటుంబసభ్యులందరూ పడుకున్న తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చింది వివాహిత. అప్పటికే ప్రియుడికి సమాచారం ఇవ్వడంతో అతడు ఏలూరుకు చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి పవర్ పేట రైల్వే స్టేషన్ (powerpet railway station) సమీపంలో వేగంగా దూసుకొస్తున్న రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

పట్టాలపై ఇద్దరి మృతదేహాలను గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చిద్రమైన స్థితిలో వున్న రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం మృతులను గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

అయితే వివాహిత ఇంట్లోంచి బయటకు వెళ్లేముందు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు డైరీలో రాసుకుంది. ఈ డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని జంట ఆత్మహత్యలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

read more  Kurnool Crime:వివాహేతర సంబంధానికి ఒకరు బలి... వేటకొడవలితో అతి కిరాతకంగా నరికి

ఇదిలావుంటే ఇలాగే వివాహితతో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని ఆమె భర్త చేతిలో అతి దారుణంగా హత్యకు గురయ్యాడో వ్యక్తి,. ఈ ఘటన ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా వట్ పల్లి మండలంలో   చోటుచేసుకుంది. 

గొర్రెకల్ గ్రామానికి చెందిన మల్కగోని అశోక్ (26), బోడ అంబయ్య స్నేహితులు. అయితే ఈ స్నేహాన్ని మరిచి అంబయ్య భార్యతో అశోక్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం అంబయ్యకు తెలియడంతో అశోక్ ను అతి కిరాతకంగా హతమార్చాడు.

గ్రామానికి చెందిన బోడ రాజు, ఉసిరికపల్లి రమేష్, ఆత్కూరి నాగరాజుల సహాయంతో అంబయ్య ఈ హత్యకు పాల్పడ్డాడు. డిసెంబర్ 28వ తేదీన రాత్రి అశోక్ తన రేకుల షెడ్డులో ఒక్కడే మద్యం సేవిస్తుండగా ఈ నలుగురు అక్కడికి వెళ్లారు. అక్కడ గొడవపడి అశోక్ గొంతును టవల్ తో బోడ అంబయ్య గట్టిగా బిగించగా, మిగిలిన వారు కదలకుండా కాళ్లు పట్టుకున్నారు. కొద్దిసేపటికి ఊపిరాడక అశోక్ మృతి చెందాడు. 
 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్